Page:
  1. 1
  2. 2

ఫిషింగ్ , ఆక్వా పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు

ఫిషింగ్ , ఆక్వా పరిశ్రమలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఫిషింగ్ , ఆక్వా పరిశ్రమల కార్యక్రమాలకు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది . ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి .. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శలకు శనివారం లేఖ రాశారు . మత్స్య రంగానికి చెందిన ఫీడింగ్ , నిర్వహణ హార్వెస్టింగ్ , ప్రాసెసింగ్ , ప్యాకింగ్ కు లాక్ డౌన్ నుంచి మినహాయింపు ఇచ్చారు . అలాగే మత్స్య ఉత్పత్తుల విక్రయం , రవాణాలకు అనుమతులు మంజూరు చేశారు . మార్కెటింగ్ , హాచేరీస్ , ఫీడ్ ప్లాంట్ , ఆక్వా వాణిజ్యానికి చేపల సీడ్ ఫీడ్ తోపాటు పనిచేసే కార్మికులకు మినహాయింపు ఇచ్చారు . అయితే .. సామాజిక దూరం , శుభ్రత పాటిస్తూ ఈ కార్యకలాపాలను కొనసాగించాలిని , వీటీని జిల్లాల అధికార యంత్రాంగం పర్యవేక్షించాలని లేఖలో స్పష్టం చేశారు సామాజిక దూరం , పరిశుభ్రత పాటించడంపై సంబంధిత సంస్ధలు , కార్యాలయాలు బాధ్యత వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు . Source : sakshi www.aquall.in