Page:
  1. 1
  2. 2

వైటెస్పాట్ పెట్టింది

వాతావరణం మార్పులు వైటెస్పాట్ తెస్తే ధరలు తగ్గించివ్యాపారులు రొయ్య రైతుల నడ్డి విరుస్తున్నాయి . నాలుగు రోజులు గా రొయ్య ధరలు ఒక్క సారిగా పతనమయ్యాయి . ఈ ఏడాది ప్రారంభంలో వాతావరణం అనూకూలించకపోయినా ధరలు ఉన్నాయన్న ఆశతో రైతులు రొయ్యల సాగుకు దిగారు. ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నా చెరువులు వేశారు . నేటికీ 70 నుంచి వంద రోజులలోపే అయింది. ఇప్పుడు వైటెస్పాట్ పుణ్యమాని రైతులు త్రీవంగా నష్టపోయారు . జిల్లా పరిధిలో వేటపాలెం , కొత్తపట్నం , ఒంగోలు రూరల్ , సింగరాయకొండ , టంగుటూరు , చినగంజాం , చీరాల , ఉలవపాడు , గుడ్లుయూరు , నాగులుప్పలపాడు , జరుగుమల్లి తదితర 11 తీరా ప్రాంత మండలాల్లో 30 వేళా ఎకరాల్లో రైతులు రొయ్యల చెరువులు సాగును చేస్తున్నారు.
వానల్లేకుండానే మంచు ..
 ఈ ఏడాది వర్షాలు లేకుండానే ఉషోగ్రత అధికంగా నమోదయ్యాయి. ఇటీవల ఒక్క సారిగా ఉష్ణోగ్రతలు తగ్గి మంచు కురవడం మొదలుపెట్టింది . ఇది రొయ్య సాగుకు మరింత ఇబ్బందిగా మారింది. సహజంగా ఎండల తరువాత వర్షాలు కురిసి ఆతరువాత మంచు కాలం రావాలి. కాని ఈ ఏడాది అందుకు విరుద్ధంగా నిన్న మొన్నటి వరకు ఎండలు మంది పోయాయి . వర్షాలు కురవకుండానే మంచు మొదలైంది . వాతావరణంలో పెను మార్పు లు సంభవించాయి. దీని  ప్రభావంతో విబ్రియోతో త్రీవ్రత  పెరిగింది  రొయ్యల కు  వైటెస్పాట్ జబ్బు సోకింది . దీంతో కౌంటు పెరగకుండానే చెరువులోని రొయ్యలను ఉన్నంత మేర తీసేయాల్సి వచ్చింది అలా చేయకుండా ఉంచితే పూర్తిగా పంట కోల్పోయే అవకాశముంది.తప్పనిసరి పరిస్ధితి లో రైతులు రొయ్యల హార్వెస్టింగ్ దిగారు . ఇదే అదునుగా వ్యాపురులు రొయ్యల ధరలు తగ్గించారు . 15 రోజుల క్రితం వరకూ రొయ్యల ధరలు అమాంతం పెరిగాయి . దీంతో రైతులు సంతోషించారు . పంట బాగా వచ్చి , ఇదే ధరలు ఉంటె  మంచి లాభాలు వస్తాయని ఆశించారు తీరా చూస్తే  వైటెస్పాట్ రొయ్య రైతులకు స్పాట్ పెట్టింది . నాలుగు రోజులుగా ధరలు పతామయ్యాయి . పెట్టుబడులు సంగతి దేవుడెరుగు కరెంటు బిల్లుల ఖర్చు కూడా వచ్ఛే పరిస్ధితి లేదు . దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్ధితి నెలకొంది.
వ్యాపారుల దోపిడీ ..
రైతులను వంచించాయినందుకు వ్యాపారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు . రైతుల దగ్గర పంట ఉన్నప్పుడు ధరలు దారుణంగా తగ్గించే వ్యాపారులు రైయుల వద్ద పంటలేనప్పుడు మాత్రం రొయ్య ధరను అమాంతం పెంచేస్తారు .  ఈ ఏడాదికి ఇదే జరిగింది . గత ఏడాది ధరలు లేకపోవడంతో రైతులు త్రీవ్రంగా నష్టపోయారు .. ఈ సీజన్ కు రొయ్య సాగు తగ్గించేందుకు రైతులు సిద్ధమయ్యారు . ఇది గమనించిన వ్యాపారులు వానాకాలం ఆగు పెంచేదుకు పంట లేని సమయంలో అమాంతంగా ధరలు పెంచారు
 sorce : sakshi