జమ్మూ కశ్మీర్ లోని ప్రముఖ ఖైబర్ గ్రూప్ సరికొత్త మైలురాయిని సృష్టించింది. ఖైబర్ ఆక్వాకల్చర్ పేరిట దేశంలోనే అతిపెద్ద రిసర్క్యులేటింగ్ ఆక్వాకల్చర్ సిస్టం (RAS) ఆధారిత హిమాలయన్ ట్రౌట్ ఫార్మ్ను గంధర్ బల్ జిల్లా లోని కంగన్ సమీపంలో ని సింధు నది ఒడ్డున విజయవంతంగా ప్రారంభించింది. 8 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును సుమారు 10.5 మిలియన్ అమెరికన్ డాలర్లు పెట్టుబడిగా వెచ్చించారు. ప్రస్తుతం ఈ యూనిట్ సంవత్సరానికి 1500 మెట్రిక్ టన్నుల ట్రౌట్ చేపల ఉత్పత్తి సామర్ధ్యంతో కార్యకలాపాలు ప్రారంభించింది. రాబోయే 3 నుంచి 5 సంవత్సరాల్లో వార్షిక ఉత్పత్తిని 7000 మెట్రిక్ టన్నులకు పెంచా8లని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.