For Advertisement Enquiries Please Contact +91 7901268899

పోషకాహార భద్రతలో ఆక్వా రంగానిది కీలక పాత్ర

img

అభివృద్ధి చేస్తే మరింత జీవనోపాధి, ఆర్థిక వృద్ధి సాధ్యం 
విజయవాడలో ష్రింప్ రిటైల్-2026 5వ ఎడిషన్ కార్యక్రమం
ఈనాడు, అమరావతి, కరెన్సీనగర్ న్యూస్టుడే: 'పోషకాహార భద్రతలో ఆక్వా రంగం కీలక పాత్ర పోషి స్తోంది. ఇందులో జీవనోపాధి, ఆర్థిక వృద్ధి సాధించడానికి ఎన్నో అవకాశా లున్నాయి' అని ఐసీఏఆర్ (ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్) ఫిష రీస్ డీడీజీ డాక్టర్ జె. కె.జెనా పేర్కొ న్నారు. రెండు రోజుల పాటు నిర్వహి స్తున్న ష్రింప్ రిటైల్-2026 5వ ఎడి షన్ కార్యక్రమం మంగళవారం విజ యవాడలో ప్రారంభమైంది. కార్యక్ర మంలో ఆక్వా ఉత్పత్తులతో ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేశారు. ఆక్వా ఉత్ప త్తుల దేశీయ వినియోగం పెంపొం దించే అంశంపై 'ఆక్వాపోస్ట్' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. 
జెనా మాట్లాడుతూ.. 'ఆక్వా ఉత్పత్తిలో కొత్త ఒరవడికి శాస్త్రీయ పరిశోధనలు దోహదపడతాయి. పరిశోధనల ఫలి తంగా నాణ్యతా ప్రమాణాలు మెరుగ వుతాయి. సుస్థిరమైన సాగు పద్ధతుల సాయంతో దేశీయ సీఫుడ్ వినియో గాన్ని బలోపేతం చేయవచ్చు' అని తెలిపారు. ఎన్ఎఫ్ బీ చీఫ్ ఎగ్జిక్యూ టివ్ డాక్టర్ బి.కె బెహెరా మాట్లా డుతూ.. 'ఆక్వా రంగం బలోపేతానికి బలమైన దేశీయ మార్కెట్ను అభి వృద్ధి చేయడం అవసరం. ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ రంగాల సమన్వయం మెరుగవ్వాలి' అని పేర్కొన్నారు. నీతిఆయోగ్, పీఎం ఆర్థిక సలహా మండలి జాయింట్ సెక్రటరీ డాక్టర్ కె. కె త్రిపాఠి మాట్లాడుతూ.. 'దేశీయ సీఫుడ్ మార్కెట్ను మరింత బలోపేతం చేస్తే దేశంలో ఎగుమతులు పెరిగి.. ఉపాధి, వ్యాపారాభి వృద్ధిలో కొత్త అవకాశాలు సృష్టించవచ్చు' అని అన్నారు. ష్రింప్ రిటైల్ కన్వీనర్ ప్రకాశ్ ప్రధాన్ మాట్లాడుతూ.. 'అన్ని విభాగాలను అనుసంధానించటం ద్వారా ఆక్వా ఉత్ప త్తులను అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యం' అని తెలిపారు. కోల్డ్-చైన్, లాస్ట్-మైల్ డెలివరీ, సీఫుడ్ నాణ్యతా ప్రమాణాలు, ట్రేసబిలిటీ, ఆధునిక వాణిజ్యం క్విక్ కామర్స్, బ్రాండింగ్, ప్యాకేజింగ్ తదితర అంశాల్లో ఇబ్బందులు.. ప్రభుత్వ సహకారంపై ఉత్పత్తి దారులు, పారిశ్రామికవేత్తలు, వ్యాపారులు చర్చించారు.

Languages

Shares

Related News