Page:
  1. 1
  2. 2

పెరిగిన రొయ్య పిల్లల ధర

భీమవరం : రొయ్య పిల్లల ధర అమాంతం పెరిగిపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. కొంతకాలం క్రితం వరకూ రొయ్య పిల్ల ధర 20 పైసల నుంచి 35 పైసల వరకూ పలికేది. ప్రస్తుతం అది 55 పైసల నుంచి 60 పైసలకు ఎగబాకింది. రాష్ట్రంలో  1.85 లక్షల హెక్టార్లలో ఆక్వా సాగు జరుగుతోంది. అధికారిక హేచరీలు 300 కు పైగా ఉన్నాయి. వీటిలో ఎక్కువ తూర్పు గోదావరి జిల్లాలోనే ఉన్నాయి. ప్రస్తుతం కావాల్సినంత మేరకు రొయ్య పిల్లలు లభించక పోవడంతో వాటి ధర అమాంతం పెరిగిపోయింది. మరోవైపు , సముద్ర జలాలతోనే రొయ్య పిల్లలు పెంచుతుంటారు. శీతాకాలం కావడంతో సముద్రపు నీటిలో ఉప్పు శాతం తగ్గిపోయింది.రొయ్య  పిల్లల పెంపకానికి లవణీయత తగ్గిపోయింది. రొయ్య పిల్లల పెంపకానికి లవణీయత 30 పిపిటీకి పైగా ఉండాలి. ప్రస్తుతం 25 పిపిటీకి పడిపోయింది. దాంతో  హేచరీల్లో ఉత్పత్తి తగ్గింది. యాంటిబయోటిక్స్ వినియోహం పై అధికారులు దృష్టి సారించడంతో ఎక్కువ మేర రొయ్య పిల్లలనుఉత్పత్తి చేయలేకపోతున్నారు. సాధారణంగా అమెరికాలోని హవాయి నుంచి తల్లి రొయ్యలను దిగుమతి చేసుకుంటారు.ప్రస్తుతం అక్కడినుంచి వచ్చే తల్లి రొయ్యల దిగుమతి తగ్గిప్పోయింది. ఈ పరిణామాలన్నీ రొయ్యపిల్లల ధరపై తీవ్ర ప్రభావం చూపాయి. ఎక్కువగాజనవరి, ఫిబ్రవరి నెలల్లోనే సాగు ప్రారంభిస్తారు. ఈ ఏడాది సీజన్ కు ముందే ధర పెరిగినందున.. సీజన్ ప్రారంభమయ్యాక ఇంకెంత స్ధాయిలో పెరుగుతుందనిరైతులు ఆందోళ చెందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో హేచరీల నుంచితెచ్చిన పిల్లలను 10 రోజుల నుంచి 15 రోజుల పాటు పెంచి కొంత మంది రైతులకు అమ్ముతుంటారు. ప్రస్తుతం హేచరీల్లో పిల్లలు దొరకకపోవడంతోఇలా పెంచే వారే కనుమరుగయ్యారు. 
Source : ennadu