Page:
  1. 1
  2. 2

రొయ్యకు రాహుకాలం


      ఆక్వా రైతులకు కష్టాలకు ఎదురీదుతున్నారు. వ్యాపారులు సిండికేట్గా మారి రోజురోజుకు రొయ్యల ధరలు తగ్గిస్తుండటంతో కుదేలవుతున్నారు. నాసిరకం సీడ్తో తగ్గుతున్న దిగుబడులకు తోడు  వ్యాపారుల దోపిడీతో పెట్టుబడులు కూడా రాక నష్టాల పాలు కావాల్సి వస్తోందని ఆందోళ చెందుతున్నారు. అయినా ప్రభుత్వం మాత్రం వీరి గోడును పట్టించుకోవడం లేదు. నాణ్యమైన సీడ్అందేలా చూడాల్సిన కోస్టల్ ఆక్వా అధారిటీ , మత్స్యశాఖలు మామూళ్ల మత్తులో పడీ రైతుల గోడు పట్టించుకోవడం లేదు. జిల్లాలో సింగరాయకొండ , టంగుటూరు, ఒంగోలు, చినగంజాం, వేటపాలెం, చీరాల తదితర మండలల్లో దాదాపు 20 వేల హెక్టార్లు రైతులు వెనామీ రొయ్యల సాగు చేస్తున్నారు. ఉలవపాడు , సింగరాయకొండ , టంగుటూరు మండలాల రైతులు  మన్నేరు , పాలేరులపై ఆధారపడగా మిగిలిన మండలాల రైతులు రొంపేరు, బకింగ్ హామ్ కెనాల్ పై ఆధారపడిరొయ్యల సాగు చేస్తున్నారు. అటుపోట్లు ద్వారా  సముద్రం నుంచి వచ్చే  ఉప్పునీరు ఆధారంగానే రొయ్యలసాగు జరుగురోంది. ఏటా సగటూన30 వేల టన్నుల రొయ్య విదేశాలకు ఎగుమతి అవుతుంది.
తగ్గుతున్న ధరలు : సిండికేట్ గా మారిన వ్యాపారులు రొయ్య ధరలను రోజురోజుకు తగ్గిస్తున్నారు. గత 10 రోజులతో పోలిస్తే  రొయ్యల ధరలు మరింత తగ్గాయి. ప్రస్తుతం 100 కౌంటు రూ. 220, 90 కౌంటు 230, 80 కౌంటు రూ. 250, 70 కౌంటు రూ. 270, 60 కౌంటు రూ 300 , 50 కౌంటు రూ. 330 , 40 కౌంటు రూ. 380 ,30 కౌంటు రూ. 420 ఉంది.
ఉత్పత్తీ.. అంతంత మాత్రమే.. :  పదిరోజుల క్రితం ఒక్కో కౌంటు పై రూ. 30 నుంచి రూ. 40 అధికంగా ఉండేది. 60, 70 కౌంటు రొయ్యలను అమ్మేందుకు రైతులు సిద్దపడటంతో వ్యాపారులు ఒక్క సారిగా ధరలు తగ్గించారు. ఇందుకు కారణం విదేశీ ఎగుమతులకు సంబంధించి ఆర్డర్స్ పూర్తి కావడమేనని వ్యాపారులు రైతులకు చెబుతుండటం గమనార్హం. దీంతో చాలా మంది రైతులు రొయ్య అమ్మకాలకు తాత్కాలిక స్వస్తి పలికారు. వాస్తవానికి నవంబర్ , డిసెంబర్ నెలల్లో రొయ్యల ఆర్వెస్టింగ్ ఆధికంగా ఉంటుంది. ఈ సమయంలోనే వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు మరింత తగ్గించి  రైతులను దోపిడి చేసేందుకు సిద్ధపడుతుంటారు. కొద్ది రోజులు ఆగితే ధర వస్తుందేమోనన్నఆశతోరైతులు ఎదురుచుస్తున్నారు. వ్యాపారులు ధరలు మరింతగా తగ్గిస్తే పెట్టుబడులు కూడా రాక రొయ్య రైతులు తీవ్రంగానష్టపోయే ప్రమాదం ఉంది.  మరో వైపు రొయ్యల ఉత్పత్తి ఈ ఏడాది కూడా అనుకున్నంతగా  లేదు . వైటు స్పాట్ వ్యాధి  సోకడంతో రొయ్యలు చనిపోతున్నట్లు సమాచారం.
Source : ennadu