Page:
  1. 1
  2. 2

గిఫ్ట్ తిలాపియాచేపల సాగుతో పోషకాహార భద్రత

చిన్న కుంటల్లో విస్తారంగా గిఫ్ట్ తిలాపియాచేపల సాగు ద్వారా చిన్న సన్నకారు రైతులు, పేదలకు పోషకాహార భద్రతను అందించవచ్చని ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆక్వాకల్చర్ నిపుణులు డాక్టర్ మోదడుగు విజయ్ గుప్తా సాక్షి సాగుబడి కి ఇచ్చిన  ప్రత్యేక ఇంటర్వ్యూలో తెలిపారు.చెరువుల్లో తిలాపియా సంతానోత్పత్తిని అరికట్టేందుకు మగపిల్లలను ఉత్పత్తి చేసి రైతులకు ఇస్తున్నందున జీవ వైవిధ్యానికి ముప్పు ఉండదన్నారు.  గుంటూరు జిల్లా బాపట్లలో జన్మించిన డా. గుప్తా.. ఖండాంతరాల్లో ఆక్వా దిగుబడుల పెంపుదలకు విశేష కృషి చేసి .. నీలి విప్లవ పితామహునిగా గుర్తింపు పొందారు.  లక్షలాది మంది  చిన్న సన్నకారు రైతులకు  ఉపకరించే  చేపల సాగు పద్ధతులను రూపోందించడం ఆయన ప్రత్యేకత ప్రపంచ  ఆహార పురస్కారాన్ని (2005), సన్ హక్  శాంతి  పురస్కారం  (2015) అందుకున్నారు.వ్యవసాయక జీవ వైవిధ్యంపై ఇటీవల ఢీల్లీలో  జరిగిన తొలి సదస్సులో ప్రధాని మోదీ నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. ఆక్వాకల్చర్ పై ఏపీ ప్రభుత్వానికి గౌరవ సలహాదారునిగా ఉన్నారు. తిలాపియా వంటి విదేశీ జాతుల చేపల వల్ల దేశంలో జలవనరుల్లో  స్ధానిక జాతుల మత్స్య సంపదకు ముప్పు వచ్చిపడిందన్న వార్తలు దక్షిణాది రాష్ట్రాలలో  ఇటీవల వెలువడుతున్నాయి. మన జలవనరుల్లో సంప్రదాయ చేపల మనుగడకు గొడ్డలి పెట్టుగా మారిందని గుర్తించి.ఈ తిలాపియా చేపల సాగుపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం , ఆంక్షలు విధించింది. అయితే . మరో వైపు తిలాపియా చేపల సాగును కేంద్ర ప్రభుత్వం, ఆంద్రప్రదేశ్ ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి.
Source : sakshi