Page:
  1. 1
  2. 2

మెరైన్ ఎగుమతుల్లో ముందంజ

ఆక్వారంగాన్ని ప్రోత్సహించేదుకు రాష్ట్ర ప్రభుత్వము చేపడుతున్న చర్యలు సత్పలితాలను ఇస్తున్నాయి.ఫలితంగా మెరైన్ ఉత్పత్తుల ఎగుమతిలో ఏపీ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. కేంద్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలోని మెరైన్ ఉత్పత్తుల ఎగుమతుల అభివృద్ధి సంస్ధ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం 2015-16 సంవత్సరంలో దేశ వ్యాప్తంగా 9.45 లక్షల మెట్రిక్  సముద్ర ఉత్పత్తులు ఎగుమతి కాగా,కేవలం ఏపీ నుంచే 1.67 లక్షల మెట్రిక్  సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి.ఈ  ఉత్పత్తులు ఎగుమతి  ద్వారా దేశవ్యాప్తంగా రూ. 30,420,83 కోట్లు ఆదాయం లభించగా మన రాష్ట్రం నుంచి రూ.  9,328 కోట్ల ఆదాయం లభించింది. దేశంలోమెరైన్ కార్గోలను పంపించే మేజర్ పోర్టుల్లో విశాఖపట్నం ప్రధానమైనది. విశాఖపట్నంలో 61 మంది సముద్ర ఉత్పత్తులు ఎగుమతి దారులు రిజిస్టర్ అయి ఉన్నారు.వీరి ద్వారా 2015-16 విశాఖపట్నం ఓడరేవు నుంచిరూ.7,161 కోట్లు విలువైన  1.28 లక్షల టన్నుల సముద్ర ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. మన రాష్ట్ర ఆర్ధిక వ్యవస్ధ బలోపేతం కావడానికి ఈ ఎగుమతులు చాలా వరకూ తోడ్పాటునందిస్తున్నాయి. సముద్ర ఉత్పత్తులు ఎగుమతుల్లో అత్యధిక వాటా రొయ్యలదే. వనామీ, బ్లాక్ టైగర్ వంటి అంతర్జాతీయంగా డిమాండ్ ఉన్నటు వంటీ రొయ్యల ఎగుమతులపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. ఆక్వా రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తన్న ఆధునిక పద్ధతులను రాష్ట్రంలో అమలు చేయడం ద్వారా ఈ ఏడాది నుంచి ఆదాయాన్ని మరింత పెంచుకొనేందుకు ఏపీ సర్కార్ వ్యూహరచన చేస్తోంది. గత నెలలో మూడురోజుల పాటు విశాఖలో  జరిగిన 20  అంతర్జాతీయ సముద్ర ఉత్పత్తులు ప్రదర్శన కూడా ఈ రంగంలో నాణ్యమైన ఉత్పత్తులు ,ఎగుమతులుపెరగడానికి దోహదపడింది. ఈ ప్రదర్శన ద్వారా రాష్ట్రం దేశవిదేశీ పెత్తూబడులనూ ఆకర్షించగలిగింది.
ఆక్వా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు : ఆక్వా రైతులకు మంచి లాభాలు తెచ్చిపెట్టే వాటిలో ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్ల ప్రధానమైనవి. ప్రస్తుతం రాష్ట్రంలోని ఆక్వా రైతులుతమ ఉత్పత్తులను చెన్నై, విశాఖపట్నం నుంచి మాత్రమే ఎగుమతి చేస్తున్నారు. రవాణాకు ఆరు గంటలకు పైగా సమయం పట్టడం వల్ల ఉత్పత్తుల నాణ్యతపై దాని ప్రభావం పడుతోంది. సముద్ర ఉత్పత్తులను యూరోపియన్ యూనియన్ ప్రమాణాల  ప్రకారం శుద్ధి చేయాలి. మనదేశం నుంచి దాదాపు వంద దేశాల సముద్ర ఉత్పత్తుల విలువ మరింత పెరగాలంటే ప్రాసెసింగ్ యూనిట్లు ఉపకరిస్తాయి. సముద్ర ఉత్పత్తులు లభ్యమయ్యే ప్రాంతాల్లోనే ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటుకూ ప్రయత్నాలు జరుగుతున్నాయి.ఆక్వా  ప్రాసెసింగ్ యూనిట్లు వల్ల పర్యవరణానికి ముప్పు ఉందని రాష్ట్ర  కాలుష్యనియంత్రణ మండలి అధికారులు చెబుతున్నారు.
మెరైన్ బోర్డు ఏర్పాటుకు సన్నాహాలు : రాష్ట్రంలో మెరైన్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుత్తం మహారాష్ట్రంలోమాత్రమే ఇటువంటి బోర్డు ఉంది. ఆ రాష్ట్రంలో 720 కిలోమీటర్ల సముద్రతీరం ఉంది. 1996 లో మహారాష్ట్ర ప్రభుత్వం మారి టైమ్ బోర్డును  ఏర్పాటు చేసింది. ఏపీలో మెరైన్ బోర్డు ఏర్పాటయితే సముద్ర ఉత్పత్తుల ఎగుమతులు భారీ స్ధాయిలో పెరిగే అవకాశం ఉంది. సముద్ర తీర ప్రాంతంలో మౌలిక సదుపాయాల కల్పన , ఓడరేవుల నిర్వహణ , వాటి అభివృద్ధి , పోర్టుల్లో ట్రాఫిక్  నియంత్రణ , సముద్రజలాలకు సంబంధించిన వ్యవహారాలను ఈ బోర్డు చూసుకుంటుంది.  సీ ఎం చంద్రబాబు ఇటీవల రష్యా పర్యటన సందర్బంలో రాష్ట్రంలో మెరైన్ రంగం అభివృద్ధికి దోహదపడే చర్చలు జరిపారు. మెరైన్ రంగంలో ఏపీ కి సంపూర్ణ సహాయ సహకారాలు అందించేందుకు రష్యాకు చెందిన యునైటెడ్ షిప్ బిల్డింగ్ కార్పొరేషన్ ముందుకొచ్చింది.
Source : surya