Page:
  1. 1
  2. 2

మత్స్య రంగంలో అగ్రస్థానమే లక్ష్యం 

విజయవాడ : ఆక్వా ఉత్పత్తులను పెంచి మత్స్య రంగాన్ని అగ్రస్థానంలో నిలపాలనేది లక్ష్యమని మత్స్యశాఖ కమిషనర్ కె .కన్నబాబు అన్నారు .ఆ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్రంలో వంద ఆక్వా హాబ్స్ , సుమారు 14  వేల అవుట్ లెట్లు ఏర్పాటు చేయనున్న నేపథ్యంలో వారికి ఆర్ధిక సాయం చేసేందుకు బ్యాంక్ ఆఫ్ బరోడా ముందుకొచ్చింది . ఈ మేరకు గురువారం నగరంలోని శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రాంతీయ కార్యాలయంలో జీఎం , జోనల్ హెడ్ మన్మోహన్ గుప్త , మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబుల అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు . చీఫ్ జనరల్ మేనేజర్ సుబ్రత్ కుమార్ , విజయవాడ ప్రాంతీయ డిప్యూటీ జనరల్ మేనేజర్ , రీజనల్ హెడ్ సి హెచ్ సి హెచ్ రాజశేఖర్ , సహాయ జీఎం పి.అమరనాధ్ రెడ్డి , మత్స్యశాఖఅధికారులు  పాల్గొన్నారు .