Page:
  1. 1
  2. 2

తెలంగాణాలో మెగా ఆక్వా హబ్ 

హైదరాబాద్ : తెలంగాణాలో భారీ స్వచ్ఛ నీటి సమీకృత చేపలు , రొయ్యల పెంపక కేంద్రం ఏర్పాటు కానుంది . రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మధ్యమానేరు ప్రాజెక్టు వద్ద దేశంలోనే అతి పెద్ద హబ్ ను 500 ఎకరాల్లో భారీ పెట్టుబడులతో 13 వేల మందికీ ప్రత్యక్ష , పరోక్ష ఉపాధిని కల్పించేలా ప్రభుత్వం ప్రణాలికను సిద్ధంచేసింది .దీనిలో భారీ పెట్టుబడులకు  సంస్ధలు ముందుకు వచ్చాయి . వారంలోనే రాష్ట్ర ప్రభుత్వం తో అవగాహన ఒప్పందం కుదుర్చుకోనున్నాయి . ప్రాజెక్టు ప్రారంభమయ్యాక మరిన్ని సంస్ధలు ఆక్వా రంగంలో పెట్టుబడులకు ముందుకొస్తాయనేది ప్రభుత్వంఅంచనా, ఆహార  శుద్ధి ప్రోత్సాహక ప్రాజెక్టు కింద పరిశ్రమలు , నీటి పారుదల , మత్స్యశాఖ లు దీనిలో పాలు పంచుకొన్నాయి . తెలంగాణాలో ఆహారశుద్ధిని పెద్ద ఎత్తున ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల వనరులను వినియోగించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది . కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం అనంతరం రాష్ట్రం లోని ప్రాజెక్టులకు జలకళ వచ్చింది . మధ్యమానేరు పొంగిపొర్లింది .  ఈనేపధ్యంలో అక్కడ ప్రవైట్ భాగస్వామ్యంతో భారీగా చేపలు , రొయ్యల పెంపకాన్ని ప్రోత్సహించాలని సర్కారు భావించింది . అనుభవమున్న మూడు సంస్ధలు దీనిపై ఆసక్తి చూపాయి .
ఆధునిక విధానంలో ..
విదేశాల్లో మాదిరి ఆధునిక విధానంలో చేపలు , రొయ్యల పెంపకాన్ని చేపట్టేందుకు సంస్ధలు , అంగీకరించాయి . ఇందులో ఏడాది పొడవునా 500 ఎకరాలను కేటాయించిన ప్రభుత్వం అందులో 300 ఎకరాలను చేప విత్తనాల ఉత్పత్తి , శుద్ధి కేంద్రాలకు కేటాయించాలని  భావిస్తోంది . ఆక్వా శిక్షణ కేంద్రాన్ని స్ధాపిస్తారు .మిగిలిన భూముల్లో సంస్ధలకు అవసరమైన మేరకు ప్రభుత్వం కేటాయిస్తోంది .ప్రాజెక్టుకు మౌలిక వసతులనూ సర్కారే సమకూరుస్తుంది .
దేశంలో న వినూత్నం 
ప్రస్తుతం దేశంలో ఎక్కడా మంచినీటి ఆక్వా హాబ్ లు లేవని తెలంగాణా ప్రభుత్వం చేపట్టే ప్రాజెక్టు వినూత్నమవుతుందని ఉన్నతాధికారి ఒకరు వివరించారు .మధ్యమానేరు వద్ద ఏర్పాటు చేయనున్న ఆక్వా హబ్ ప్రతిపాదనలు చూసి అందులో పెట్టుబడులకు మూడు సంస్ధలు సంసిద్ధత వ్యక్తం చేశాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి . త్వరలోనే వాటితో ఒకే రోజు అవగాహన ఒప్పందం జరుగుతుందని వెల్లడించాయి .
భారీగా ప్రోత్సాహం 
ఇప్పటి వరకు టీఎస్ ఐ పాస్ ద్వారా ఆహారశుద్ధి లో వివిధ ప్రాజెక్టులకు అనుమతులు లభించాయి . తాజాగా ఆక్వా ను సైతం ఆ పరిధిలోకి తీసుకురానున్నారు . దేశంలోని వివిధ ఆక్వా ప్రాజెక్టులకు అందిస్తున్న రాయితీలు , ప్రోత్సహకాలను పరిశీలించి వాటి కంటే ఎక్కువగా ఇక్కడ ఇవ్వాలని తెలంగాణా ప్రభుత్వం భావిస్తోంది .

source : eenadu