Page:
  1. 1
  2. 2

మత్యశాఖ అభివృద్ధి కి ప్రభుత్వం విశేష కృషి

మత్యశాఖ అభివృద్ధి కి ప్రభుత్వం విశేష కృషి చేస్తోందని గొల్లపూడి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ కొమ్మా కోటేశ్వరరావు , ప్రసాదం పాడు సర్పంచ్ సర్నాల గంగా రత్నం అన్నారు . విజయవాడ రూరల్ మండలం ప్రసాదం పాడులో ప్రభుత్వం ప్రోత్సహంతో ఏర్పాటైన ఫిష్ రిటైల్ అవుట్ లెట్ ను వారు సోమవారం ప్రారంభిచారు . ఈ సందర్భంగా కోటేశ్వరరావు , గంగా రత్నం మాట్లాడుతూ మత్స్య సంపదను అభివృద్ధి చేసేందుకు మత్స్య కారులకు ఆర్ధిక ఇబ్బందులను తొలగించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు . ఈ నేపధ్యం లో ప్రతి ఒక్కరికి తాజా చేపలు , సీ ఫుడ్స్ ను తక్కువ ధరకు అందుబాటులో తీసుకొచ్చెందుకు ప్రభుత్వ ప్రోత్సహంతో రిటైల్ అవుట్ లెట్లు ఏర్పాటువుతున్నాయి . పేర్కొన్నారు . ఈ అవుట్ లెట్లు చేపలు , రొయ్యలు , పీతలు , సీ ఫుడ్స్ అందుబాటులో ఉంటాయని వివరించారు . ఈ కార్యక్రమంలో రూరల్ ఎంపీపీ చెన్ను ప్రసన్న కుమారి , జేడీపీటీసీ సభ్యుడు కాకర్లపూడి సువర్ణ రాజు , సొసైటీ చైర్మన్ సాదం వెంకటేశ్వరరావు , వైస్సార్ సీపీ రాష్ట్ర సంయక్త కార్యదర్శి  ఆర్ . వెంకటేశ్వరరావు , ఎంపీటీసీ సభ్యులు పైలా శ్రీనివాస్ , దూరు రత్నం , వార్డు  సభ్యుడు నార్నాల బాలాజీ , రిటైల్ అవుట్ లెట్ నిర్వాహకుడు సత్తిబాబు తదితరులు పాల్గొన్నారు .