Page:
  1. 1
  2. 2

మీనం ....దీనం 

ఏలూరు : చేపల ధరల పడిపోవడంతో రాష్ట్రంలోని ఆక్వా రైతులు నష్టాలను చవిచూసే పరిస్ధితులు  తలెత్తాయి .శీలావతి , కట్ల బొచ్చే చేపలను 15 రోజుల క్రితం వరకు కిలో రూ .110 వరకు ఎగుమతిదారులు కొనుగోలు చేయగా ..ప్రస్తుతం ఆ ధర రూ .90 కి పడిపోయింది .ధరలు పడిపోవడం , ఎగుమతులు మందగించడంతో చేపల్ని చెరువుల్లోనే ఉంచేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది .దీని వల్ల మేత నిర్వహణ ఖర్చులు పెరిగిపోతున్నాయి .కిలోకు రూ .20 చొప్పున ధర తగ్గడంతో రైతులు టన్నుకు రూ .20 వేల ఆదాయాన్ని నష్టపోవాల్సిన దుస్ధితి ఏర్పడింది . మేత,  నిర్వహణ ఖర్చుల రూపంలోమరో రూ .10 వేల వరకు నష్టాన్ని చవిచూడాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు .
ఉత్పత్తి పెరిగింది ....డిమాండ్ తగ్గింది 
రాష్ట్ర వ్యాప్తంగా 2.25 లక్షల హెక్టారులో రైతులు చేపల సాగు చేస్తున్నారు . ఒక్క పశ్చిమ గోదావరి  జిల్లాలోనే 1.20 లక్షల హెక్టార్లలో రైతులు చేపలు సాగు చేస్తుండగా ... తూర్పు గోదావరి , కృష్ట్ణ జిల్లాలు ఆ తరువాత స్ధానాల్లో ఉన్నాయి .రాష్ట్రంలో ఏటా సుమారు 22.50 లక్షల టన్నులకు పైగా చేపలు ఉత్పత్తి అవుతున్నాయి .మన రాష్ట్రం నుంచి 15 రోజుల క్రితం వరకు ఒడిశా , పశ్చిమ బెంగాల్ , అసోం , నాగాలాండ్ , బీహార్ , కర్ణాటక రాష్ట్రాలకు రోజుకు సగటున 6,550 టన్నుల చేపల ఎగుమతి అయ్యేవి .ప్రస్తుతం 3,900 టన్నులు మాత్రమే ఎగుమతి అవుతున్నాయి . 15 రోజుల క్రితం వరకు శిలావతి , కట్ల , బొచ్చె వంటి రకాల చేపలను కిలో రూ .110 వరకు ఎగుమతిదారులు కొనుగోలు చేయగా ... ప్రస్తుతం కిలో రూ 90 కి పడిపోయింది .పెట్టుబడులు , లీజు మేత , కూలీల ఖర్చులు పెరిగిపోయిన తరుణంలో చేపల ధర తగ్గడం రైతులను నష్టాలకు గురి చేస్తోంది . మరో వైపు బీహార్ , ఒడిశా , పశ్చిమ బెంగాల్ , అసోం రాష్ట్రాల్లోనూ చేపల సాగు మొదలవడంతో ఉత్పత్తి పెరిగింది దీంతో ఆయా రాష్ట్రాలకు ఎగుమతులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయని , దీని వల్ల ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు గతంలో విధ్యుత్ కొరత యూనిట్ ధరలు ఎక్కువ ఉండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు .వైస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఆక్వా రైతులకు తక్కువ ధరకే విద్యుత్ అందించడంతో పాటు వివిధ ప్రాంతాల్లో ఆక్వా ల్యాబ్ లు ఏర్పాటు చేశారు .గత ఏడాది కరోనా వైరస్ విజృంభించిన సమయంలో ఇతర రాష్ట్రాల్లో చేపల దిగుమతులు నిలిచిపోకుండా ముఖ్యమంత్రి వైస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడంతో ఆక్వా రైతులు ఎంతో ఉత్సాహంతో సాగును చేస్తున్నారు . 
స్థానిక మార్కెట్లను మందగమనమే 
కోవిడ్ కారణంగా పట్టణ పేదల ఆర్ధిక పరిస్థితులు దెబ్బతిన్నాయి . సెకండ్ వేవ్ ఉధృతమవుతుండంతో ఆ ప్రభావం స్థానిక చేపల మార్కెట్లో కొనుగోలుపై పడుతోందని రైతులు చెబుతున్నారు . మరో వైపు గోదావరిలో నీరు తక్కువగా ఉండటం , చేపల చెరువులకు నీరిచ్చే పరిస్ధితి లేకపోవడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోతున్నారు . చేపల చెరువులకు మరికొంత కాలం పెట్టుబడులు పట్టకుండా ఆకుపచ్చని , ఈ లోగా ధర పెరిగితే నష్టాల నుంచి గట్టెక్కుతామని రైతులు అభిప్రాయపడుతున్నారు .
source : sakshi