Page:
  1. 1
  2. 2

లైసెన్సు లేని ఆక్వా సాగుకు ఉత్తర్వులను సమీక్షించి మంజూరు చేయాలన్న ఒంగోలు జిల్లా కలెక్టర్ సుజాతశర్మ

ఒంగోలు: జిల్లాలో రొయ్యల సాగుకు అవసరమైన అనుకూలమైన అనుమతులను చెక్ లిస్ట్ ప్రకారం ఇవ్వడానికి సజావుగా పరిశీలించి మంజూరు ఉత్తర్వులను జారీ చేయాలని కలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయంలో జిల్లాస్ధాయి ఆక్వా అధారిటి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో ఇప్పటి వరకూ కమిటి ద్వారా ఇచ్చిన లైసెన్సులపై సమీక్షించారు . మత్య్సశాఖ ఏడీ లాల్ అహ్మద్ మాట్లాడుతూ జిల్లాలో 324  హెక్టార్లలో సాగు పునరుద్దరణకు 235 దరఖాస్తులు వచ్చినట్లు వివరించారు . వాటిని మండల కమిటీకి పంపితే ఆమోదించారన్నారు. అనుమతులు లేకుండా ఆక్వా సాగు చేస్తున్న వారి నుంచి 643 దరఖాస్తులు రాగా.. వాటిలో 282 హెక్టార్లకు సంబంధించిన 212 ఆమోదించాలని మండల కమిటీ నుంచి సిఫార్సులు వచ్చాయన్నారు.కలెక్టర్ స్పందించి మండల స్ధాయి  ఆమోదం పొందిన దరఖాస్తులను రెండో జేసీ నేతృత్వంలోని జిల్లాస్ధాయి ఉపకమిటీ పరిశీలనకు పంపాలన్నారు.  ఆ కమిటీ చెక్ లిస్ట్ ప్రకారం పరిశీలనకు పంపాలన్నారు. జిల్లాస్ధాయి కమిటీ ఆమోదం కోసం ప్రతిపాదలను సిద్దం చేయాలన్నారు. మంచినీటి చెరువుల్లో పెరిగే రొయ్యలకు సంబంధించి పది హెక్టర్ల వరకూ మండల కమిటీ పరిశీలించాలని తెలిపారు.ఆ పై డివిజన్ స్ధాయి కమిటీ పరిశీలించాలని తెలిపారు.