Page:
  1. 1
  2. 2

ఆక్వా ఎగుమతులకో  రైలు 

ఈశాన్య రాష్ట్రాలకు రవాణా సదుపాయం 
బీమవరం : బీమవరం పరిసర ప్రాంతాల చేపలు , రొయ్యలను ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి చేయడానికి ప్రత్యేక కార్గో రైలు ఏర్పాటు చేయనున్నారు . ఈ మేరకు రైల్వే శాఖ అధికారుల బృందం ఆదివారం బీమవరం రానున్నట్లు రొయ్య రైతుల సంక్షేమ సంఘం జిల్లా కార్యదర్శి వేగేశ్న  సత్యనారాయణ రాజు  తెలిపారు . ఇటీవల ఎంపీ రఘు రామకృష్టంరాజు కార్గో రైలు ఏర్పాటు ఆవశ్యకతపై కేంద్ర రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లడంతో అధికారుల బృందం రానున్నట్లు తెలిపారు . ప్రస్తుతం రోజువారీ లారీలపై భువనేశ్వర్ , పశ్చిమ బెంగాల్ , అసోంతోపాటు  ఈశాన్య రాష్ట్రాలకు ఆక్వా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయన్నారు . గతం నుంచి ఉన్న ప్రత్యేక రైలు ప్రతిపాదన ఎంపీ ప్రయత్నంతో ముందడుగు పడుతోందన్నారు .ఈ మేరకు చేపల రైతుల సంఘం అధ్యక్షడు గాదిరాజు సుబ్బరాజు , రొయ్య రైతుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు మోహన్ రాజు , రైతులతో రైల్వే అధికారులు సమావేశం కానున్నారు .
source : Andhra joythi