Page:
  1. 1
  2. 2

ఆక్వా రైతుకు అధారిటీ 

ఆక్వా అధారిటీకి ముఖ్యమంత్రి చైర్మన్ గా వ్యవహరిస్తారు . పశుసంవర్ధక శాఖ మంత్రి వైస్ చైర్మన్ గా , సభ్య కార్యదర్శిగా  మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఉంటారు . ఈ బోర్డు విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటుంది .కార్యనిర్వాహక కమిటీకి చైర్మన్ గా మత్స్యశాఖ , వైస్ చైర్మన్ ఆ మత్స్యశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి , సభ్యులుగా పశు సంవర్ధక , మత్స్యశాఖ , డైరీల కమిషన్లు ఉంటారు . సాంకేతిక సహా కమిటీ : చైర్మన్ గా మత్స్యశాఖ కమీషనర్  మత్స్య సాంకేతిక పరిజ్ఞానా సంస్ధ ప్రిన్సిపాల్ సభ్యులుగా ఉంటారు . అథారిటీకి సాంకేతిక సలహాలను ఈ కమిటీ అందిస్తుంది . జిల్లా స్ధాయి కమిటీకి కలెక్టర్ చైర్మన్ గా , మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ సభ్యులుగా వ్యవహరిస్తారు .
ఆక్వా రైతులకు కరెంట్ చార్జీలను తగ్గించడంతో పాటు కరోనా సమయంలో అండగా నిలిచినా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి చేపలు  రొయ్యల సాగు అభివృద్ధి ప్రాధికార సంస్ధ ఏర్పాటు చేసింది . నాణ్యమైన సీడ్ , ఫీడ్ అందించడంతో పాటు విక్రయాల్లో రైతులు నష్టపోకుండా చూడటం అధారిటీ ప్రధాన లక్ష్యం రైతులు , మత్స్యకారుల అభివృద్ధికి రైతులు , కృషి చేస్తూ వారి ప్రయోజనాలను అధారిటీ పరిరక్షిస్తుంది .కమిషన్ ఏజంట్లు , వ్యాపారుల   దోపిడీ నుంచి రైతుల్ని కాపాడే రక్షణ కవచంలా నిలుస్తుంది . ఆక్వా రంగం అభివృద్ధికి రైతులు , వ్యాపారులతో సామరస్య పూర్వకంగానే వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటుంది . అయితే  వారిది దాటినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అధారిటీ ఏమాత్రం వెనుకాడడు  ఈ మేరకు మత్స్య , పశు సంవర్ధక మంత్రి మోపిదేవి వెంకటరమణారావు బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందడంతో ప్రాధికారిక సంస్ధ ఏర్పాటు విస్తారమైన కోస్తా తీరాన్ని అభివృద్ధికి ఆలవాలంగా , ఉపాధికి నెలవుగా తీర్చిదిద్దనుంది  గ్రామ సచివాలయాలు ద్వారా ఇప్పటికే ఆక్వా అసిస్టెంట్లు సాగుదారులకు అన్ని కాలుగా తోడ్పాటునందిస్తుండగా రైతు భరోసా కేంద్రాల  సీడ్, ఫీడ్ , సాంకేతిక సలహాలను కూడా అందించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి .సీడ్, ఫీడ్ పై నియంత్రణ లేకపోడవడంతో....
1 . రాష్ట్రంలో మత్స్య సాగుకు అనువైన వనరులు సమృద్ధిగా ఉన్నా వ్యవస్ధీకృత విధానాలు లేకపోవడంతో ఆక్వా రంగం ఒడిదుడుకులు ఎదుర్కొంటుంది .ఆక్వా సాగులో కీలకమైన సీడ్ , ఫీడ్ నాణ్యతపై ప్రభుత్వ నియంత్రణ లోపించింది.మంచి రేటు వచ్చే వరకు రైతులు కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్లలో నిల్వ చేసుకునేందుకు అవసరమైన సదుపాయాలు లేవు 
2 .చేపలకు పెద్దగా విదేశీ ఎగుమతులు లేకపోవడంతో పూర్తిగా ఇతర రాష్ట్రాలకే ఆధారపడాల్సి వస్తోంది .కరోనా విపత్తుతో ఇతర రాష్ట్రాల్లో మార్కెట్లు పూర్తిగా మూతపడటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు . ఆ పరిస్ధితిని నివారించి రాష్ట్రంలో చేపల వినియోగం .మార్కెట్ల విస్తరణకు చర్యలు చేపట్టడం అవసరం .
3 .రొయ్యల సాగుపై సరైన నియంత్రణ లేనందున నాణ్యతా లోపంతో విదేశీ ఎగుమతులు తరచూ తిరస్కారణకు గురవుతున్నాయి . సరైన ధర కూడా లభించడం లేదు .
4 . ఇవన్నీ పరిశిలించిన అనంతరం ఆక్వా సాగు , అనుబంధ రంగాల్లో సుస్ధిర సాధించేందుకు ఒక చట్టం అవసరమని ప్రభుత్వం భావించింది .
అధారిటీ విధులు ఇవి 
 1 . రాష్ట్రంలో 2019 - 2020 లో 41.75 లక్షల టన్నుల చేపలు , రొయ్యల ఉత్పత్తి జరిగింది .26.50 లక్షల మందికి ఈ రంగం ద్వారా ఉపాధి లభిస్తోంది . శాస్త్రీయ విధానాల ద్వారా దిగుబడిని మరింత పెంచేందుకు చట్టం అవకాశాలను కల్పిస్తుంది .
2 . ఈ చట్టం ద్వారా ఆక్వా రైతులకు నాణ్యమైన సీడ్ , ఫీడ్ ఇతర ఇన్ పుట్స్ సకాలంలో సరసమైన ధరలకు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందనుంది .
3 .విపత్కర పరిస్ధితుల్లోనూ రైతులు నష్టపోకుండా ఆక్వా ఉత్పత్తుల నిల్వకు మౌలిక సదుపాయాలూ కల్పించడం , కనీస మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవడం , ఆక్వా రైతులు , అనుబంధ పరిశ్రమలకు సులభంగా లైసెన్సులు మంజూరు .
4 . ఆక్వా ల్యాబ్ ల ద్వారా సీడ్ , ఫీడ్ నాణ్యతా పరీక్షలు చేపట్టి వ్యాధి నివారణ చర్యలపై రైతులకు సూచనలు చేస్తుంది . సాగులో మంచి యాజమాన్య పద్ధతులు అనుసరించడం ద్వారా విదేశి ఎగుమతులు , ఇతర రాష్ట్రాలకు మత్స్య సంపద చేరవేసేలా చర్యలు . ప్రాసెసింగ్ , మార్కెటింగ్ రంగాలను మరింత బలోపేతం చేసి రైతులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం .
అధారిటీ అధికారాలు 
1 . రాష్ట్రంలో చేపల పెంపకం సామర్ధ్యం , సమస్యలు తెలుసుకునేందుకు సర్వేలు నిర్వహించడం .
2. ఆక్వా  సాగుకు సంబంధించిన అన్ని అంశాలపై చట్టాలు తయారు చేయడం , నియమ నిబంధనలు , విధి విధానాలు రూపొందించి అమలు చేయడం . జిల్లా , డివిజన్ , ప్రాంతీయ కార్యాలయాలు ఏర్పాటు చేయడం 
3.  ప్రాధికార సంస్ద విధుల నిర్వహణకు కేంద్రం నుంచి నిధులు పొందడం .
4 .ల్యాబ్ ల అనుసంశయాన వ్యవస్ధ , ఆక్వా టెక్నీషియన్లు , సంస్ధలను ఏర్పాటు చేయడం 
5 . దాణా , చేపలు , రొయ్య పిల్లలపై నాణ్యాతా ప్రమాణాలను తనిఖీలు , ఆడిట్ లు చేయడం , చట్టంలోని నిబంధనలు ఉల్లఘించిన సంస్ధలపై పెనాల్టీలు విధించడం .
6 . అనధికారిక చేపల పెంపకం , ప్రాసెసింగ్ , పంపిణీ , అమ్మకం , యూనిట్లు క్రమబద్ద్దీకరించడం 
7 . వ్యవసాయ ఉత్పాదిక భూములను చేపల పెంపకం చెరువులుగా మార్పిడి చేయడాన్ని నియంత్రించడం
8 .స్టేక్  హొల్టర్లతో సంప్రదింపులు జరిపి చేపలు , సముద్ర ఉత్పత్తులకు రేటు నిర్ణయుంచడం .
9 . శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేయడం . నైపుణ్యాభివృద్ధి , మానవవనరులు అభివృద్ధికి చర్యలు తీసుకోవడం 
10 . సముద్ర ఉత్పత్తుల ఎగుమతులపై మార్కెట్ సమాచారాన్ని సేకరించి రైతులకు అందించడం
11. చేపపిల్లలు , దాణా , ఆక్వా ఉత్పత్తులు , ఔషధాలు ఇతర సేవలపై చార్జీలు విధించి వసూలు చేయడం 
12 .విదేశి పెట్టుబడులను ఆకర్షించేందుకు జాయింట్ వెంచర్లు ఏర్పాటుకు ఒప్పందాలు చేపట్టడం
Source : sakshi