Page:
  1. 1
  2. 2

ఆక్వా రంగం బలోపేతానికే  చట్టం 

అమరావతి : ఆక్వా రంగం మరింత బలోపేతం చేయడానికే ప్రభుత్వం ఆక్వా అధారిటీ చట్టాన్ని తీసుకొస్తోందని రాష్ట్ర మత్య్స , పశుసంవర్ధక శాఖ మంత్రి మోపిదేవి వెంకటరమణారావు తెలిపారు . సోమవారం తాడేపల్లిలో ఆక్వా ఆధారటీ బిల్లుపై అన్ని వర్గాల అభిప్రాయాలను తెలుసుకోవడానికి ఏర్పాటు చేసినా సమావేశానికి మంత్రి మోపిదేవి హాజరయ్యారు .ఆయన మాట్లాడుతూ ... 
1. కోవిడ్ -19  ప్రారంభంలో ఆక్వా ఐతులు ఎదుర్కొన్న సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి వైస్ జగన్ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు , కేంద్ర మంత్రులతో సైతం మాట్లాడారు . 
2. అసంఘటిత రంగంగా ఇది ఇంకా కొనసాగుతుండటం వల్లనే ఈ పరిస్ధితి వచ్చిందని సీఎం గుర్తించారు .
3. ఈ రంగం అభివృద్ధికి ప్రత్యేక చట్టం , అద్దికారులు ఉండాలని భావించారు .
4. ఆయన సూచన మేరకు ఆక్వా అధారిటీ బిల్లును రూపొందించి రాష్ట్రంలో ఆక్వా రంగానికి సంభందించిన అన్ని వర్గాలతో , సంస్ధలతో సంప్రదింపులు జరిపాం .
5. వారిచ్చిన సూచనల మేరకు బిల్లులో మార్పులు తీసుకువచ్చాం . ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఆక్వా అధారిటీ బిల్లు తీసుకొస్తాం .
6. గ్రామ సచివాలయాల్లో ఆక్వా రంగానికి సంబంధించిన అన్ని అనుమతులు , రిజిస్ట్రేషన్లు జరుగుతాయి . 
7. ఈ చట్టంలోని అన్ని కమిటీల్లోనూ రైతులకు ప్రాతినిధ్యం కల్పిస్తున్నాం .
8. వ్యవసాయం , మత్య్సశాఖ ప్రత్యేక  ప్రధాన కార్యదర్శి పూనమ్ మాల కొండయ్య మాట్లాడుతూ .. రైతు భరోసా కేంద్రాల్లో ఆక్వా రైతులకు అవసరమైన నాణ్యమైన మేత , విత్తనాలను అందుబాటులోకి తీసుకురానున్నామని  చెప్పారు .
ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఆక్వా ల్యాబ్ లలో రైతులు ఎటువంటి దోపిడికి గురికారన్నారు 
source : sakshi