Page:
  1. 1
  2. 2

ఏపీలో మత్స్యరంగ జాతీయ సంస్థలు నెలకొల్పండి( కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ కోరిన రాష్ట్ర మంత్రి మోపిదేవ

చేపలు , రొయ్యల ఎగుమతుల్లో ఏటా గణనీ యమైన వృద్ధి సాధిస్తున్న ఆంధ్రప్రదేశ్ మత్స్యకారుల జీవనో పాధిని మరింతగా ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయా ల్సిందిగా కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ను రాష్ట్ర మంత్రి మోపిదేవి వెంకటరమణ కోరారు . ఈ మేరకు ఆయన శుక్రవారం ఢిల్లీలో కేంద్ర మంత్రిని కలసి వినతి పత్రాన్ని సమ ర్పించారు . 974 కి . మీ . విస్తారమైన తీర ప్రాంతాన్ని కలిగి ఉన్న ఆంధ్రప్రదేశ్ ఫిషరీస్ ఎక్స్ పోర్ట్స్ లో రికార్డు స్థాయి వృద్ధి నమో దవుతోందని , మత్స్యకారులను మరింతగా ప్రోత్సహించేం దుకు విజయవాడలో మత్స్య అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు . ఆక్వా సాగులో నూతన పద్దతులు , కొత్త సాంకేతికత వినియోగంపై శిక్షణ ఇచ్చేందుకు కృష్ణా జిల్లా తాళ్లపాలెంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రొక్కిష్ వాటర్ ఆక్వా కల్చర్ ప్రాంతీయ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు . ఈ కేంద్రం ఏర్పాటుకు స్థలం ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు .