Page:
  1. 1
  2. 2

ఆంధ్రలో ఆక్వారంగం భేష్ (• అన్నివిధాలా తోడ్పాటు అందిస్తాం • కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్)

ఆంధ్రప్రదేశ్ లో మత్స్యరంగం అభివ దికి కేంద్రం నుంచి అన్ని విధాలా తోడ్పాటు  అందిస్తామని కేంద్ మత్య , పశుసంవర్ధక , పాడిపరిశ్రమ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ అన్నారు . ఇప్పటికే రాష్ట్రం ఈ రంగంలో స్థిరమైన అభివృద్ధి సాధిం చిందన్నారు . గురువారం కృష్ణాజిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు . ఉంగుటూరు మండలం మానికొండలో ఎం పెడా ఆధ్వర్యంలోని రాజీవ్ గాంధీ ఆక్వాకల్చర్ కేంద్రాన్ని సంద ర్శించారు . ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు . రాష్ట్రంలో మత్స్యరంగ పురోగతికి రూ . వెయ్యి కోట్లతో పైప్ లైన్ వేస్తున్నట్లు చెప్పారు . ఇందుకు కేంద్రం రూ . 850 కోట్లు కేటాయించిందన్నారు . తాను ముఖ్యమంత్రి జగన్ ని కలిసి రాష్ట్రానికి కేంద్రపథకాల ద్వారా అందే సాయం గురించి చర్చించానన్నారు . అధునాతన ప్రయోగ శాలలు మంజూరుచేయాలని , అనుమతులకు కొచ్చి , చెన్నై వరకు వెళ్లాల్సి వస్తోందని ఆయన అన్నారని చెప్పారు . ఇకపై రాష్ట్రంలోనే వచ్చేలా నిర్ణయం తీసుకుంటామన్నారు . హెక్టారుకు రొయ్యల దిగుబడిని రెట్టింపు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలి - పారు . మానికొండలో అభివృద్ధి చేస్తున్న గిఫ్ట్ థిలాపియా చేపలు - ఎగుమతి అయ్యేలా చూస్తామన్నారు . అనంతరం నందివాడ మండలం జనార్ధనపురం వెళ్లి . . చేపల రైతులతో మాట్లాడారు . ముదినేపల్లిలో ఆక్వాఫీడ్ కర్మాగారాన్ని పరిశీలించారు .