Page:
  1. 1
  2. 2

తల్లి రొయ్యల ఉత్పత్తి కేంద్రం ఏర్పాటు రాష్ట్రానికి గర్వకారణం

కావలి : రొయ్యల సాగులో తొలిసారి వెనామి రకాన్ని తీసుకొచ్చిన తెలుగు దేశం నియోజకవర్గం భాధ్యడు బీద మస్తాన్ రావు . దేశంలోనే తల్లి రొయ్యల ఉత్పత్తి కేంద్రాన్ని రాష్ట్రంలో నెలకొల్పడం గర్వకారణమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సోమి రెడ్డి చంద్రమోహన్ రెడ్డి తెలిపారు .కావలి మండలం చెన్నాయపాలెం వద్ద "బీ ఎం ఆర్ బ్లూ జెనిటిక్స్ " ఏర్పాటైన తల్లి రొయ్యల  ఉత్పత్తి కేంద్రాన్ని సోమవారం ఆయన ప్రారంభించారు . ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతు మస్తాన్ రావు నేతృత్వంలో హేచరీలు , సాగు ప్లాంట్లు దేశంలోనే గుర్తింపు పొందాయన్నారు . మెక్సికో , ప్రాన్స్ తదితర దేశాల నుంచి శాస్త్రవేత్తల సహకారంతో స్థానికంగానే తల్లి రొయ్యల ఉత్పత్తి చేయడం గొప్ప విషయమన్నారు . ఫలితంగా ఆక్వా సాగు రైతులకు ఎంతో  మేలు జరుగుతుందన్నారు .బీ ఎం ఆర్ ట్రస్ట్ ద్వారా ఆక్వా పరిశ్రమలు నెలకొలిపి వేలాదిమందికి ఉపాధి కల్పిస్తున్న మస్తాన్ రావు ఆదర్శ ప్రాయుడని కొనియాడారు . రొయ్యల సాగులోనే ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని 70 శాతం రొయ్యల ఎగుమతి రాష్ట్రం నుంచే జరుగుతోందన్నారు .రూ . 24 వేలకోట్ల విలువైన రొయ్యలను రాష్ట్రం నుంచి విదేశాలకు ఎగుమతి చేస్తున్నట్లు చెప్పారు.

source : eenadu