Page:
  1. 1
  2. 2

రొయ్య .... రయ్ ...రయ్

రొయ్య ఎగుమతుల ద్వారా ప్రభుత్వానికి కోట్లాది రూపాయల్లో విదేశీ కరెన్సీ వస్తుంది . ఈ మేరకు రెండెంకెల వృద్ధి లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఆక్వా సాగును ప్రోత్సహిస్తోంది . జిల్లాలోని కోస్తా తీఇరా ప్రాంత గ్రామాల్లో సాగు విస్తారంగా జరుగుతోంది . వర్షాభావ పరిస్ధితుల నేపథ్యంలో దిగుబడులు తగ్గడంతో పాటు , వ్యాధులతో సాగు ఒడిదుడుకులను ఎదుర్కొంటుంది . మరో వైపు వ్యాపురుల కూటమి కారణంగా మార్కెట్ లో గిట్టుబాటు ధర లభించడం లేదు . ఈ పరిస్ధితుల్లో సాగుకు మరింత ప్రోత్సాహకం లభించేలా రైతులకు రాయితీకి పై పరికరాలను అందజేస్తున్న ప్రభుత్వం  ఇటి వల విద్యుత్తు ఇళ్ళలో రెండు రూపాయలు చొప్పున రాయితీ ఇచ్చింది . తాజాగా సాగు నిమిత్తం చెరువులకు అనుమతులను సులభతరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీఇరా ప్రాంత మండల పరిధిలోని గ్రామాలను ఆక్వా జోన్లుగా విభజించింది . ఈ నేపథ్యంలో మత్స్య శాఖ అధికారులు ఇప్పటికే జోన్ల వారీగా గ్రామాల వివరాలను సిద్ధం  చేశారు.
రైతులకు తప్పనున్న తిప్పలు
ఆక్వా జోన్లను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా గుర్తించిన 45  గ్రామాల  ప్రరిధిలో చెరువును తీసుకునేందుకు నేరుగా సంబంధిత రైతులకు మత్స్యశాఖ అనుమతి జారీ చేస్తుంది. .ఇప్పటి వరకు ఓ రైతు   సాగుకు అనుమతి పొందాలంటే సర్వ్  నంబరు , విస్తీరాన్ని పేర్కొంటూ మత్స్యశాఖ కు దరఖాస్తూ  చేసుకోవాలి . ఆతర్వాత సదరు భూమిని  వ్యవసాయ , కాలుష్య  నియంత్రణ మండలి , భూగర్భ జల , రెవెన్యూ , పంచాయితీ , మత్స్య శాఖ  అధికారులు పరిశీలిస్తారు . దానిపైఆయా శాఖల పరంగా నిబంధనల మేరకు ఎలాంటి అభ్యంతరం లేదని సిఫార్సు చేయాల్సి ఉంటుంది అందుకు సంబంధిత  అధికారుల నుంచి దస్త్రం ముందుకు కదిలిచేందుకు  రైతులు వ్యయ , ప్రయాసలు పడాల్సి వచ్ఛేది  . ఇక నుంచి జోన్ల పరిధిలో సాగుకు తిప్పలు ఉండవు . మరో వైపు అనధికారిక సాగు రైతులు కూడా అనుమతి పొందడం ద్వారా ప్రభుత్వ  పధకాలు పొందే అవకాశం ఏర్పడుతుంది .
సుమారు 25 వేల ఎకరాల్లో సాగు
కోస్తా తీరప్రాంతమైన  తొమ్మిది మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో అయిదు వేల  మంది రైతులు ఆక్వా సాగు పై ఆధారపడి జీవిస్తున్నారు . అందులో ఇప్పటి వరకు మూడు వేల మంది రైతులు 17500 ఎకరాల్లో సాగు నిమిత్తం మత్స్యశాఖ నుంచి అనుమతి పొందారు . మరో రెండు వేళా మంది రైతులు 7500 ఎకరాల్లో అనధికారకంగా సాగు చేస్తున్నారు . అనుమతి ఉన్న రైతులకు మాత్రమే ప్రభుత్వం ఇచ్ఛే పరికరాలతో పాటు , విద్యుత్తు రాయితీకి వస్తుంది . తద్వారా మిగతా రైతులు ఆర్ధికంగా నష్టపోతున్నారు  . ప్రస్తుతం ఆక్వా జోన్లు ఏర్పాటు కారణంగా గుర్తించిన గ్రామాల  పరిధిలో సాగు చేస్తున్న వారితో పాటు , కొత్తగా ముందుకు వచ్ఛే రైతులు ఇక మీదట సులభంగానే అనుమతులు పొందే అవకాశం ఏర్పడుతుంది .
రైతులకు వసతుల కల్పన
సుస్ధిర ఆక్వా సాగుకు కింద అనుమతి ఇస్తారు . జాతియ  గ్రామీణ ఉపాధి హామీ పధకం కింద చెరువుల వద్దకు రైతులు , వాహన రాకపోకలకు విఐలుగా రహదారులతో పటు , వృధా నీటిని  బయటకు పంపేందుకు  కాలువలు ఏర్పాటు చేయనున్నారు . మత్స్యశాఖ ఆధ్వర్యంలో చెరువులను పరిశీలించి నియతి పరిక్షలు , వ్యాధుల నియంత్రణకు వాడాల్సిన మందులపై అవగాహన కల్పిస్తారు . మరో వైపు రైతులకు ఉపయుక్తంగా ఉండే పరిశ్రమలను స్ధాపించేందుకు అనుమతుల మంజూరు సులభతరం కానుంది. సాగుదారులు ప్రభుత్వం ప్రకటించిన జోన్ పరిధిలోకి రావడం కారణంగా నాణ్యమైన రొయ్య పిల్లలు , మెటా మందులను తక్కువ ధరకే సరఫరా చేసేందుకు కంపెనీకి నిర్వాహకులు ముందుకు వస్తారని భావిస్తున్నారు .
నేటి సమావేశంలో ఆమోదం ....
జోన్ల ఏర్పాటుపై కలెక్టర్ వినయ్ చంద్ అధ్యక్హతను శుక్రవారం ఆక్వాసాగుకు అనుమతులు ఇచ్చే అనుభంశాఖల జిల్లా అధికారాలతో జిల్లాస్ధాయి  కమిటీకి ఆమోదం అనంతరం గ్రామాల జాబితాను ప్రభుత్వ అనుమతికి పంపనున్నారు . ఆ తర్వాత గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసి  స్ధానికుల నుంచి అభిప్రాయాలను సేకరించనున్నారు . ఈ ప్రక్రియ అంతా జనవరి కల్లా పూర్తి కానున్నట్లు సమాచారం  .

source : eenadu