Page:
  1. 1
  2. 2

చేపకు చుక్కెదురు

అమరావతి : ఆంధ్రప్రదేశ్ నుంచి చేపల దిగుమతులపై నాగాలాండ్, అసోం, రాష్ట్రాల్లోఆంక్షలు విధించారు.కాంసర్ కారకమైన ఫార్మాలిన్ రసాయనాన్ని పూతగా వేస్తున్నారని పరీక్షల్లో వెల్లడి కావడంతో ఆ రాష్ట్రాలు ఇక్కడి నుంచి వేళ్ళే చేపల్ని నిషేధించారు. దీంతో రాష్ట్రం నుంచి ఎగుమతులు నిలిచిపోయి ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. ఏపీ నుంచి రోజూ 200 లారీలకు పైగా చేపలు దేశంలోని వివిధ రాష్ట్రాలకుఎగుమతి అవుతున్నాయి. ఇందులో 50 శాతం పశ్చిమ బంగ్లాకు వెళ్తాయి.50 శాతంలో ఈశాన్య రాష్ట్రాలకు వెళ్లేవే అధికం . నాగాలాండ్, త్రిపుర, అసోం , మేఘాలయ తదితర రాష్ట్రాల్లో ఏపీ చేపకు ఎక్కువ డిమాండ్ ఉంది. తాజాగా నాగాలాండ్, త్రిపుర, రాష్ట్రాల మార్కెట్లో అమ్ముతున్న చేపలపై అక్క్డి అధికారులు పరీక్షలు నిర్వహించగా వాటిపై ఫార్మాలిన్ పూత ఉన్నట్టు తేలింది. అవి ఏపీ నుంచి వచ్చినవని తేలడంతో నాగాలాండ్ పూర్తిగా దిగుమతి నిలిపివేసింది. త్రిపురలో పరీక్షలు చేశాకనాణ్యతను బట్టి అనుమతిస్తున్నారు. అసోం పది రోజుల పాటూ ఏపీ నుంచి వచ్చే చేపలను దిగుమతులు చేసుకోవద్దని ఆదేశాలిచ్చింది. జూన్ 29 న చేపల నుంచి నమూనాలు తీసి పరీక్షలుచేయించగా ఫార్మాలిన్ గుర్తించినట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ  మంత్రి పిజూష్ హజారికా వెల్లడించారు. ఎలాంటి రసాయన అవశేషాలులేవనినిర్ధరించుకున్న తర్వాతే దిగుమతికిఅనుమతిస్తామని స్పష్టం చేశారు.ఫలితంగాఅక్కడకు తీసుకేళ్లిన ఉత్పత్తులను పక్క రాష్ట్రాలకు తీసుకెళ్లి తక్కువధరకు విక్రయించి వస్తున్నారు. 
అక్కడే పూత వేస్తున్నారు.... ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్న చేపల్లో ఫార్మాలిన్ ఉండదని రైతులు స్పష్టం చేస్తున్నారు. అధికారులు ఈమధ్య నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లోనూఈవిషయం వెల్లడైందని గుర్తు చేస్తున్నారు. రాష్ట్రం  నుంచిఅక్కడకు లారీలు వెళ్లినతర్వాత చిల్లర వ్యాపారులు క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేసి వాటిని రెండు మూడు రోజులు విక్రయించేందుకు వీలుగా ఫార్మాలిన్ పూతగా వేస్తున్నారని చెబుతున్నారు.వల నుంచి బయటకు రాగానే ఐస్ లో వేసి లారీకి ఎక్కిస్తాం .. ఇక మందుకలిపేదెక్కడ  అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రం నుంచి కలకత్తాకు లారీ వెళ్లాలంటే మూడు రోజులు పడుతుందని , అక్కద నుంచిఈశాన్య రాష్ట్రాలకు  వెళ్లాంటే మరో రెండురోజులు పడుతుందన్నారు. నాలుగేళ్లనాడు కూడా ఇలాంటిం పరిస్ధితి వచ్చినప్పుడు తాము పరీక్షలు చేయించగా అక్కడే కలిపినట్లు తేలిందని ఆంధ్రప్రదేశ్ చేపల రైతుల సంఘం అధ్యక్షడు సీతారామరాజు వివరించారు. ఇప్పుడూ మన తప్పేమీ లేదని స్పష్టం చేశారు.
ప్రత్యేక బృందాన్ని పంపిస్తున్నాం  : చేపల్లో  ఫార్మాలిన అవశేషాలపై రాష్ట్రప్రభుత్వం అప్రమత్తమైంది.స కేంద్ర వ్యవసాయ, సంక్షేమశాఖ సమ్యుక్త కార్యదర్శి ఈఈ రమేశ్ కుమార్ ఆధ్వర్యంలో గురువారం భీమవరంలోదీనిపై చర్చించారు. ఆయా రాష్ట్రాల అధికారుల అనుమానాలను నివృత్తిచేయాలని నిర్ణయించారు. ఇందులోభాగంగా మన రాష్ట్రం నుంచి మత్స్య శాఖ , ఆహార భద్రతా శాఖల నుంచి ముగ్గురు అధికారుల బృందాన్ని శుక్రవారంఅసోం పంపిస్తున్నట్లు మత్స్య శాఖ ఎక్స్ అఫిషియో కమిషనర్ రామ్ శంకర్ నాయక్ చెప్పారు. సెంట్రల్ ఇన్ స్టిట్యూట్  ఆఫ్ ఫిషరీస్ టెక్నాలజీ నుంచి సంబధిత పరీక్ష పరికరాలు తెప్పించి వీరికి అందుబాటులోఉంచామన్నారు. వీరు ఆయా రాష్ట్ర అధికారుల సమక్షంలో చేపలకుపరీక్షలు నిర్వహిస్తారు. అందులో అవశేషాలేమీ లేవని తేలితే  దిగుమతులు మళ్లీ కొనసాగుతాయి.ఒకవేళ  ఫార్మాలిన్ అవశేషాలుంటే చేపలు ఎక్కడ నుంచి వచ్చాయి. రైతులు ఎవరు అనేది విచారించి సంబంధిత వ్యక్తులపై చర్యలుతీసుకుంటామని రామ్ శంకర్ నాయక్ స్పష్టం చేశారు.
Source : eenadu