Page:
  1. 1
  2. 2

రొయ్యల రైతుకు ఊరట 

యూనిటీ విద్యుత్తూ రూ. 2కే .
కిలో రూ. 30 ధర ఎక్కు వ  ఇచ్చేందుకు ఎగుమతిదారులు అంగీకారం .
ఉత్పత్తిలో  నాణ్యతా పెరగాలి .
రైతులు, ఎగుమతిదారులు సమావేశంలో సీ ఎం చంద్రబాబు .
       ఆక్వా రైతులకు ప్రభుత్వం ఊరటనిచ్చింది యూనిటీ విద్యుత్ ధరను రూ.3.86 నుంచి రూ.రెండుకు తగ్గిస్తున్నట్లు  సీ ఎం చంద్రబాబునాయుడు ప్రకటీంచారు. దిని వల్ల ప్రభుత్వం పై ఏడాదికి రూ. 372  కోట్లు భారం పడుతుందని వివరించారు. ఏడాది పాటు దిన్ని అమలు చేస్తామని హామీనిచ్చారు. ఇదే సమయంలో ఎగుమతిదారులు కిలో రూ .30 చొప్పన అధిక ధర ఇచేందుకే ముందుకు వచ్చారు. దాణా ధరను తగ్గించేందుకు  ఉత్పత్తిదారులు అంగీకరించారు. మొత్తంగా రొయ్యల ఉత్పత్తి వ్యయం కిలోకు రూ. 60 వరకు తగ్గించనుంది  రొయ్యల ధరల పతనాన్ని సీ ఎం చంద్రబాబునాయుడు దృషికి తెదేపా నాయకుడు రఘురామకృష్ణ రాజు తీసుకేళారు. ఈ క్రమంలో శనివారం సచివాలయంలో రైతులు ఎగుమతిదారులు, హేచరీలు, మత్యశాఖ అధికారులతో ఆయన సమావేశమయ్యారు. పచ్చిమగోదావరిలో ఆక్వా ప్రాసెసింగ్ ఫ్లాంట్లు నుంచి గొట్టపు మార్గం వేయడానికి రూ .10 కోట్లు వెచ్చించాం. దాన్ని అడ్డుకుంటున్నారు. మంచి చేసేప్పుడు ఎవరైనా బురద జల్లుతుంటే మీరెందుకు (ఆక్వా రైతుల ) ముందుకు రావడం లేదు? అంతా కలిస్తేనే మంచి జరుగుతుందని గుర్తుపెట్టుకోండి. చెరువులకు  భీమా చేయించాలని నేను కోరితే కేంద్రం ఒప్పుకోవడం లేదు అని పేర్కొన్నారు వందలో పదిమంది రైతుల వల్లే యాంటీబయోటిక్స్ సమస్య  వచ్చిందని, ఇదే కొనసాగితే రైతులు, హేచరీలు, ఎగుమతిదారులు దెబ్బతింటారని పేర్కొంన్నారు. సమావేశంలో అయన తెలిపిన అంశాలివి. 
•    ధరల  సమస్య పరిష్కారానికి ప్రాసెసింగ్, ఎగుమతి దారులు ,మధ్యవర్తులు, హేచరీల, రైతులు, ఎంపెడా కాలుష్య నియంత్రమండలి, ప్రభుత్వం, ఎగుమతుల మండలి నుంచి ప్రతినిధులతో కమిటీని వేద్దామని సీ ఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. నాణ్యమైన ఉత్పత్తి పెంచాలని, ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు.
•    విద్యుత్తు  రాయితీకి రూ. 440కోట్లు వెచ్చిస్తున్నాం . కాలుష్య స్థాయి తగ్గించేందుకు రూ. 400కోట్లు నుంచి రూ. 500కోట్లు ఇస్తున్నాం.  ఎక్కడిపడితే అక్కడ తవ్వేసి అనుమతి ఇవ్వమంటున్న దింతో చుట్టుప్రక్కల రైతులు, గ్రామస్దులంతా వ్యతిరేకమవుతున్నారు. పొలాలన్ని పాడవుతున్నాయి తాగడానికి నీళ్లు దొరకవనే భయపడుతున్నారు ఇక మీదట ఇలా ఉండకూడదు. ఒక జోన్ ఇస్తాం అన్ని సౌకర్యాలు కల్పిస్తాం అక్కడే సాగు చేసుకోవాలి. 
•    సాగులో సాంకేతిక  ముఖ్యం ఎంపెడా కార్యాలయాన్ని ఏపీకి తరలించారు. విదేశాల్లో మార్కెట్టు అవకాశాలను పెంచుకోవాలి. 
Source: eenadu