Page:
  1. 1
  2. 2

హ.... క్వా!

ఒంగోలు:  
    జిల్లా తీర ప్రాంతంలో ఉన్న 11 మండలాల పరిధిలో ఏటా 20 వేల హెక్టార్లలో 7 వేలకు మందికి పైగా రైతులు వెనామీ రొయ్యల సాగు చేస్తున్నారు.జనవరిలో వేసిన సీడ్ ప్రస్తుతం హార్వెస్టింగ్ కు వచ్చింది . ధరలు మాత్రం పతనా వస్ధకు చేరాయి. గతంతో పోలిస్తే కిలోకు రూ. 80 నుంచి రూ. 100 ధర తగ్గింది. ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో డిసేంబర్,జనవరిలో వేసినరొయ్యలు ఇపుడు హార్వెస్టింగ్ కు వచ్చాయి. దీంతో వ్యాపారులు సిండికేట్ గా మారి ధరలు తగ్గించారు. ఏటా ఆక్వా ఎగుమతుల ద్వారా ఆంధ్రప్రదేశ్ కు రూ. 40 వెల కోట్లు ఆదాయంఉండగా , ఒక్క ప్రకాశం జిల్లా నుంచి రూ. 8నుంచి రూ. 10 వేల కోట్లు ఆదాయం ఉంది. ప్రస్తుత6 ధరలు పతనం కావాంతో ఆక్వా రంగం కుదేలై రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్ధి నెలకొంది.
ఎకరాలో రొయ్యల సాగుకు ఖర్చు:
    ఒక ఎకరాలో ఒక పంటకు లక్షన్నర రొయ్య సీడ్ కు అయ్యే ఖర్చు రూ. 75 వేలు, రెండు టన్నుల మేత రూ. 1,60,000. చెరువు లీజు ఒక పంతకు రూ. 35 వేలు, కరెంటు బిల్లు రూ. 30,000, మినరల్స్ , ఇతర మందులు రూ. 60 వేలు, ఫీడ్ బాయ్ మూడు నెలల ఖర్చు రూ. 36 వేలు మెత్తం రూ. 3,96,000 ఖర్చువుతుంది. అయితే 100 కౌంటు ఒకటిన్నర టన్ను ప్రస్తుత రేటు ప్రకారం రూ. 2,55,000 మాత్రమే  వస్తుంది. ఈ లెక్కనఎకరాకు రూ. 1,41,000 నశ్టం వస్తోంది.   
అన్నీ నకిలీలే...
     సీడ్ మొదలుకొని  మినరల్స్, మందులు అధిక శాతం నకిలివే వస్తున్నాయి.  కోస్టల్ ఆక్వా అధారిటీ సర్టిఫై చేసిన కంపెనీలే సీడ్ , మ్అందులు తయారు చేయాలి అనుమతులున కంపెనీలు50 లోపే ఉండగాఅనధికారంగా వందల కంపెనీలువీటిని తయారు చేస్తున్నా కోస్టల్ ఆక్వా అధారిటీ వాటిని పట్టించుకోవడంలేదన్న్అవిమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక హెచరీలు యాంటీబయోటిక్స్ అధికంగా వాడుతుండటంతో రొయ్యల్లో ఎదుగుదల లేకుండా పోయిందిరెండు నెలలకు 100 కౌంటు రావాల్సి ఉండగా మూడు నెలలు కూడా 100 కౌంటు వచ్చే పరిస్ధితిలేదు . రోగ నిరోధక శక్తి క్షీంణించటంతో ఎదుగుదల లేకుండా పోతోంది. ఇక ఎకరానికి లక్షన్నరసీడ్వేస్తే 50 వేలకు తగ్గకుండా సీడ్ చనిపోంతోంది.నాసిరకం కావడం వల్లేఈ పరిస్ధితితలెత్తినట్లు తెలుస్తంది. చాలా మటుకు అనుమతులున్న ఏజెన్సీలే నకిలీ సీడ్ సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.చైన్నెకేంద్రంగా ఉన్న కోస్టల్ ఆక్వా అధారిటీ ఏ మాత్రం  పట్తించుకోవడలేదు. 
వాస్తవానికి ఒక హెక్టారుకు సంవత్సరానికి 6 లక్షల సీడ్అవసరం , జిల్లాలో సాగవుతున్న 20 వేల హెక్టార్లకు సంవత్సరానికి 10 వేల మిలియన్ రొయ పిల్లలు అవసరం . జిల్లాలో ప్రస్తుతం  34 హెచరీస్ రైతులకు సీడ్ ను సరఫరా చేస్తున్నాయి. ఫ్లోరిడా నుంచి తల్లి రొయ్యను తొలుత చెన్నైకు తీసుకొస్తారు, క్వారింన్టైన్ ప్రొసీజర్ చేయాలి. హేచరీల్లో స్కానింగ్ చేయాలి. తల్లి రొయ్య ఒక్కొక్కటి రూ. 50 వేల నుంచి రూ లక్ష వరకు ఉంటుంది. కోస్టల్ ఆక్వా అధారిటీ హేచరీలకు తల్లి రొయ్యలను సరఫరా చేస్తొంది. ఒఅక్కొక్క తల్లి రొయ్య నుంచి ఆరు దఫాలుగా మాత్రమే గుడ్లను పికిలించి రొయ్య పిల్లలనుఉత్పత్తి చేయవచ్చు. 
ఒక్కొక్క హెచరీకి సగటున సంవత్సరంలో 150 మిలియన్ కు పైగా రొయ్య పిల్లలు ఉత్పత్తి సామర్ధ్యం ఉంటుంది. ఈ లెక్కన 34 హేచరీల పరిధిలో 5,200 మిలియన్  రొయ్య పిల్లలు అవసరం 10 వేల మిలియన్లు , ఈ లెక్కన 4,800 మిలియన్లు రొయ్య పిల్లల కొరత ఉంది. అయితే వీట్ని జిల్లాలోని కొన్ని హెచరీలు తల్లి రొయ్య నుంచి ఉత్పత్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఉత్పత్తి చేసిన నాసిరకంసీడ్ ను రైతులకు అంటగడుతున్నారు. ఈ నాసిరకం పిల్లలతో 40 వేల ఎకరాల్లో రొయ్యల్ సాగు చేస్తున్నారు. రొయ్య పిల్లల్లో రోగ నిరోధక శక్తి లేకపోవడం , సరైన ఎదుగుదల ఉండకపోవడం , కొన్ని పిల్లలు చెరువులోన్ చనిపోతుండటం రెండు నెలలకు ఊడా కిలో 150 నుంచి 170 కౌంటుకు 4 నుంచి 5 నెలలు పడుతుండటం తదితరక్ఆరణాలతో రొయ్యరైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఇక నాసి రకం సీడ్ సాగు చేసే30 శాతం మందిరైతులు ఎకరాకు రూ. 2లక్షల చొప్పున వరకు నష్టపోతున్నారు. రొయ్యల ధరలు అధికంగా ఉన్న సమయం లోనూ నాసిరకం సీడ్ పుణ్యమా అని గిట్టుబాటు కాక రైతులు నష్టాలపాలు కావాల్సి వస్తోంది. రైతులకు నాసిరం సీడ్ అంటగడుతున్న హెచరీలపై మత్స్యశాఖతో పాటు కోస్టల్ ఆక్వా అధారిటీ అధికారులుచర్యలు తీసుకోవడంలేదు.
 Source : sakshi