Page:
  1. 1
  2. 2

వ్యాధులు వాటి లక్ష్యణాలు (కోవర్ట్ మార్టాలిటి వ్యాధి)

వ్యాధి లక్షణాలు :
•ఏట్రోఫిక్ లేక పాలిపోయిన  హెపాటోపాంక్రియాస్
•ఉదర భాగమున వున్న కండరము తెల్లరంగులో ఉండుట
•ఆహార నాళం పూర్తిగా లేక పాక్షికంగా ఖాళీగా ఉంటుంది.
•పైన కవచము మెత్తగా ఉంటుంది. పెరుగుదల తగ్గుట.
రొయ్య చనిపోయే పద్ధతి :
•రొయ్యలు చెరువులలీని అడుగు భాగాన చనిపోయి ఉంటాయి.
•30 నుండి 80 రోజుల పెంపకం సమయంలో  రొయ్యలు చనిపోతాయి.
•ప్రతిరోజు కొనప్రాణంతో ఉన్న లేక మరణించిన రొయ్యలను గమనించవచ్చు .
•60-80 రోజుల తరువాత వ్యాధి ఎక్కువగా ప్రబలి ఉంటుంది. NO2-N మరియు నీటి ఉష్టోగ్రత 28 సెంటిగ్రేడ్ కంటే ఎక్కువ ఉంటుంది.
•సుమారు 80 శాతం రొయ్యలు చనిపోతాయి.
వ్యాధి కారకము :
•కోవర్ట్ మోర్టాలిటినోడా వైరస్.
వ్యాధి గుర్తించు పద్దతులు:
•రివర్స్ ట్రాన్స్ ప్రెషన్ – పిసిఆర్ పద్ధతి
•పిసిఆర్  టెస్ట్ కొరకు శాంపిల్ –హిమోలింప్ , హెపాటోపాంక్రియాస్,రొయ్య యొక్క కండరము అవసరము.
•కణజాల పరీక్ష.
ఈ వ్యాధి సోకే రొయ్యలు :
•వనామీ రొయ్యలకు ఈ వ్యాధి సోకుతుంది.
వెక్టార్ :
•ఈ వ్యాధిని చేరవేసే జీవులను గుర్తించబడలేదు.
వ్యాధి వ్యాపింపజేసే పద్ధతి:
•హారిజంటల్ పద్ధతి
వ్యాధి యాజమాన్యం:
•సాగు చెరువులలో పిసిఆర్ చే పరీక్షించబడిన  నెగిటివ్ పిల్లలను స్టాక్ చేయడం
•ఆరోగ్యవంతమైన మరియు బలమైన పిల్లలను స్టాక్ చేయాలి