Page:
  1. 1
  2. 2

వ్యాధులు వాటి లక్ష్యణాలు (ఎక్యూట్ హెపటోపాంక్రియాటిక్ నెక్రోసిస్ వ్యాధి(AHPND)/ ఎర్లీ మార్టాలిటి సిండ

వ్యాధి యొక్క లక్షణాలు :
సాగు చెరువులో వ్యాధి లక్షణాలు:
•హెపాటోపాంక్రియాస్ తెల్లగా లేక పాలిపోయి వుండవచ్చు.
•హెపాటోపాంక్రియాస్ సైజు తగ్గి చిన్నదిగా మారుతుంది.
•రొయ్యల యొక్క బాహ్య కవచం మెత్తగా మారుతుంది. అన్న వాహికలో తక్కువగా ఆహారం ఉంటుంది. లేక అన్నవాహిక ఖాళీగా ఉంటుంది.
•హెపాటోపాంక్రియాస్ నల్లని మచ్చలు లేక గీతలు గమనించవచ్చు.
•హెపాటోపాంక్రియాస్ ని బొటనవేళ్లతో సరిగా నలపలేము.
•పైన ఉదహరించిన మార్పులు పిల్లలను సాగు చెరువు వేసిన 10 రోజులలో గుర్తించవచ్చు.
•సరిగా ఈదలేని పిల్లలు సాగు చెరువు  యొక్క క్రింద భాగంపై వుంటాయి. లేక నీటిపై తేలుతాయి.
వ్యాధిని కలిగించే జీవి :
•వ్యాధి విబ్రియో పారాహిమోలైటికస్ బ్యాక్టీరియాకు చెందిన వైరులెంట్ ప్లాస్మిడ్స్ మరియు టాక్సిస్ జీన్సు కలిగివున్న ఒక పేధోజనిక్ స్ట్రెయిన్  ద్వారా సంక్రమించును.
వ్యాధి సంక్రమించే పిల్లలు :
•చిన్న రొయ్యపిల్లలు
గుర్తింపు పద్ధతులు :
•టాక్సిన్ జీన్ ని గుర్తించుటకు పిసిఆర్ పద్ధతి
•కణాల పరీశీలన : హిస్టోపేధాలజీ
వ్యాధి కలిగించే జీవులు :
•APHND వ్యాధి పీనియస్ మోనోడాన్ మరియు ఎల్ .వనామీ జాతులకు చెందిన రొయ్యలలో ఏర్పడుతుంది.
వెక్టార్ :
•ఈ వ్యాధిని చేరవేసే జీవులను గుర్తించబడలేదు.
వ్యాధి వ్యాపింపజేసే పద్ధతి:
•హారిజంటల్ మరియు వర్టికల్
వ్యాధి యొక్క యాజమాన్యం :
•పిసిఆర్ నెగిటివ్ పిల్లలను స్టాక్ చేయడం
•ఆరోగ్యవంతమైన మరియు బలమైన పిల్లలను స్టాక్ చేయాలి
•పిఎల్ లను నర్సరీలలో పెంచాలి.
•మంచి ప్లవకాలు వున్న చెరువులలో పిల్లలను స్టాక్ చేయాలి.
•విబ్రియోను నిర్ణీత వ్యవధిలో పరీక్షిస్తూ విబ్రియోలోడు తక్కువగా వుండుటకు చర్యలు చేపట్టాలి.
ఈ క్రింద సూచించిన సాంకేతిక పద్ధతులు/కార్యక్రమాలు APHND యాజమాన్యంలో ఉపయోగించాలి. ప్రోబయోటిక్, టిలాపియాచేపల పెంపకపు నీరు,బ్యాక్టిరియల్ బయోప్లాక్ వాడకం బయోరెమీడియేటర్స్,యిమ్యునో స్టిమ్యులెంట్స్ , విటమిన్లు మరియు ఫేజ్ ధెరపి..