Page:
  1. 1
  2. 2

రొయ్యల రైతుల సమస్యలు పరిష్కరిస్తాం:

అమరావతి: తూర్పుగోదావరి జిల్లాలో రొయ్యల చెరువుల అనుమతుల విషయంలో ప్రభుత్వ పరంగా అడ్డంకులుంటే పరిశీలిస్తామని మత్స్య శాఖ మంత్రి ఆదినారాయణ రెడ్డి పేర్కొన్నారు. నిభంధనలకు లోబడి అనుమతులిచ్చేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లా రొయ్యల సాగు రైతులు శుక్రవారం సచివాలయంలో మంత్రిని కలిశారు. సాగులో తమకు ఎదురవుతున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ .. జిల్లా కలెక్టర్ తో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. సమావేశంలో మత్స్య శాఖ  ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ట ద్వివేది , ఎమ్మెల్సీ బీద మస్తాన్ రావు, అఖిల భారత రొయ్యల సాగు రైతు సమాఖ్య  అధ్యక్షడు రుద్రరాజు వెంకట రాజు పాల్గొన్నారు.

Source : eenadu