Page:
  1. 1
  2. 2

రొయ్య య్యో


హేచరీలు నాసిరకం సీడ్ అంటగడుతుండటంతో జిల్లాలోని రొయ్య రైతులు ఏటా రూ. 800 కోట్ల మేర నష్టపోతున్నారు. పిల్ల రొయ్య ఆదిలోనే చనిపోవడం, ఉన్న వాటిలో ఎదుగుదల లోపించడం మూడు నెలలు పాటూ పోషించినా కిలో 100 కౌంటుకు చేరకపోవడం తదితర కారణాలతో రొయ్య రైతులు తీవ్ర నష్టాలను చవిచూడాల్సి  వస్తోంది. జిల్లాలోతీర ప్రాంత మండలాల పరిధిలో ఏటా 20 వేల హెక్టార్లలో వెనామీ రొయ్యలు సాగవుతున్నాయి. వాస్తవానికి  ఒక హేక్టారుకు ఏడాదికి 6 లక్షల సీడ్ అవసరం . జిల్లాలో సాగవుతున్న 20 వేల హేక్టార్లకు సంవత్సరానికి 10 వేల మిలియన్ రొయ్య పిల్లలు అవసరం . ప్రస్తుతం 34 హేచరీస్ రైతులకు సీడ్ సరఫరా చేస్తున్నాయి. ఫ్లోరిడా నుంచి తల్లి రొయ్యను తొలుత చెన్నైకు  తీసుకొస్తారు. క్వారింన్ టైన్ప్రొ సీజర్ చేయాలి. హేచరీల్లో స్కానింగ్  చేయాలి. తల్లి రొయ్య ఒక్కోక్కటి రూ. 50 వేల నుంచి లక్ష  వరకు ఉంటుంది. చెన్నైలోని కోస్టల్ ఆక్వా అధారిటీ హేచరీలకు తల్లి రొయ్య నుంచి ఆరు దఫాలుగా మాత్రమే గుడ్లను పికిలించి రొయ్య పిల్లలను ఉత్పత్తి చేయవచ్చు . అంతకు మించి ఉత్పత్తి  చేస్తే ఆ సీడ్ కు సంబంధించిన రొయ్యల్లో ఎదుగుదల ఉండదు. రోగ నిరోధక శక్తి సన్నగిల్లుతుంది. రొయ్య బలంగా తయారయ్యే పరిస్ధితిఉండదు.ఈ సీడ్ ను సాగుచేసిన రైతులు నష్టపోతారు. ఒక్కొక్క హేచరీకి సగటున ఏడాదిలో 200 మిలియన్ రొయ్య పిల్లల ఉత్పత్తి సామర్ధ్యం  ఉంటుంది. ఈ లెక్కన 26 హేచరీల పరిధిలో మొత్తం రొయ్య పిల్లల ఉత్పత్తి సామర్ధ్యం  5,200 మిలియన్లు  జిల్లాలో సంవత్సరానికి 10 వేల మిలియన్ల రొయ్య పిల్లలు అవసరం అంటే జిల్లాలో ఉత్పత్తి అవుతున్న దాని కన్నా4,800 మిలియన్లు రొయ్య పిల్లలు అదనంగా అవసరం ఉంది.అయితే 4,800   రొయ్య పిల్లలను సైతం జిల్లాలోని కొన్ని హేచరీలు తల్లి రొయ్య నుంచి ఉత్పత్తి చేసినట్లు తెలుస్తోంది. ఇలా ఉత్పత్తి చేసిన నాసిరకం సీడ్ ను రైతులకు అంటగడుతున్నారు. ఈనాసిరకం పిల్లలతో 40 వేల ఎకరాల్లోరైతులు నాసిరకం రొయ్యలు సాగు చేయాల్సి వస్తోంది. రొయ్య పిల్లలో నిరోధక శక్తి లేకపోవడం , సరైన ఎదుగుదల ఉండకపోవడం , కొన్ని పిల్లలు చెరువులోనేచనిపోతుండటం ,రెండు నెలలకు కూడా కిలో 150 నుంచి 170 కౌంటుకు మించి రాకపోవడం , 40 కౌంటుకు 4 నుంచి 5నెలలు పడుతుండటంతో  తదితర కారణాలతో రొయ్య రైతులు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది. హెక్టారుకు 6 లక్షల సీడ్ వేయాల్సి ఉండగా రైతులు 4లక్షలు మాత్రమే వేస్తున్నారు. ఎకరాకు5 టన్నుల దిగుబడి వస్తోంది. ఒక టన్ను మూడున్నర లక్షలు , ఒక టన్ను కు రెండున్నర నుంచి మూడు లక్షలు వరకు ఖర్చు వస్తోంది. రే ట్లు తగ్గితే నష్టాలు తప్పని పరిస్ధితి ఇక నాసిరకం సీడ్ సాగు చేసే 30 శాతం మంది రైతులు ఎకరాకు రూ. 2 లక్షల వరకు నష్టపోతున్నారు. ఈలెక్కన జిల్లాలో రెండు పంటలకు కలిపి 40 వేల ఎకరాల్లోసాగును గణిస్తే రైతులు రూ. 800 కోట్లమేరనష్టపోతున్నారు. రొయ్యల ధరలు అధికంగా ఉన్న రోజుల్లో నాసిరకం సీడ్ పుణ్యమా అని గిట్టుబాటు కాక రైతులు నష్టాల పాలుకావాల్సి వస్తోంది. రైతులకు నాసిరకం సీడ్ అంటగడుతున్న హేచరీలపై మత్స్య శాఖతో  పాటు కోస్టల్ఆక్వాఅధారిటీ అధికారులు చర్యలు చేపట్టాల్సి వస్తోంది. అయితే హేచరీల నుంచి పెద్ద ఎత్తున మామూళ్ళు పుచ్చుకుంటున్న ఇరు శాఖలకుచెందిన  కొందరు అధికారులు ఏ మాత్రం పట్టించుకోకపోవడంతో రైతులు తీవ్రంగానష్టపోవాల్సివస్తోంది. వెనామీ రొయ్యలను అమెరికా ,యూరప్ , జపాన్ ,చైనా దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ఏటా 2,500 కోట్ల మేర ఎగుమతులు జరుగుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అనుమతి ఉన్న హేచరీలు 34 ఉండగా ,ప్రసెసింగ్ ప్లాంట్లు 4ఉన్నాయి. రొయ్యలసాగుకు కోస్టల్ ఆక్వా అధారిటి అనుమతి తప్పనిసరి. విద్యుత్ చార్జీలు యూనిట్కు రూ. 3.75 ఉండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని యూనిట్ ధరను రూ. 2  ఇవ్వడంతో పాటూ 24 గంటల పాటూ విద్యుత్ ను సరఫరా చేయాలని రైతులు కోరుతున్నారు. రొయ్యల సాగులోజిల్లాలోయాంటిబయోటిక్స్ వాడకం పెరిగిందని అధికారులే  అంగీకరిస్తున్నారు. ఇది వాడటం వల్ల రొయ్యను వినియోగించేవారికి జబ్బులు వస్తున్నాయనిదీని వల్ల ఎగుమతులు ఇబ్బందికరంగా మారాయని అధికారులు చెబుతున్నారు.
Source : sakshi