Page:
  1. 1
  2. 2

మత్స్యరంగానికి త్వరలో సమగ్ర చట్టం:

భీమవరం : మత్స్యరంగంలో గతం నుంచి ఉన్న చట్టాలన్నీ క్రోడీకరించి త్వరలోనే ఒకే సమగ్ర చట్టాన్ని తిసుకురానున్నట్ళు మత్స్య శాఖ కమిషన్ర్ రమాశంకర్ నాయక్ వెల్లడించారు.పశ్చిమగ్దావరి జిల్లా భీమవరంలో యాంటీబయోటిక్స్ గురువారం నిర్వహించిన జిల్లా స్ధాయి సదస్సులో ఆయన మాట్లాడారు. ఆక్వా పరిశోధన కేంద్రాల అవసరం ఎంతో ఉందని పేర్కోన్నారు. విత్తన, మేత నాణ్యత, రొయ్యల ఎగుమతికిముందు చేసే పరీక్షలకు వేర్వేరు కేంద్రాలు ఉన్నాయన్నాయి. ఈ మూడింటికి ఒకే చోట ప్రత్యేక పరిశోధనకేంద్రాన్ని ఏర్పాటు చేసే దిశగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. కోస్టల్ ఇండియా డెవలప్ మెంట్ కౌంసిల్ చైర్మన్ జీవీఆర్ శాస్త్రి మాట్లాడుతూ రానున్న రోజుల్లో భీమవరంలో ఆక్వా పరిశోధనకేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
Source : eenadu