Page:
  1. 1
  2. 2

నాణ్యమైన మత్స్యఉత్పత్తులపై దృష్టి

రాష్ట్ర ప్రభుత్వం మత్స్యరంగంపై ప్రత్యేక దృష్టి సారించింది. నాణ్యమైన ఉత్పత్తులను ఎగుమతి చేసే అంశంపై ప్రధానంగా దృష్టి పెట్టింది.మంచి డిమాండ్ గల చేపలు , రొయ్యలు, పీతల రకాలు రాష్ట్రంలో   దొరకడం లేదు. వీటి కోసం మన రైతులు ఇతర రాష్ట్రాలపై ఆధారపడాల్సిన పరిస్ధితి నెలకొంది. అక్కడికి వెళ్ళి తీసుకురావడమూ వ్యయ ప్రయాసలతో కూడినది  కావడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో మన రాష్ట్రంలోనూ నాణ్యమైన రకాలను ఉత్పత్తి చేయగలిగే హేచరీలనువివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తోంది. చేపలు. రొయ్యల ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే మొదటి స్ధానంలో నిలిచింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే దాంట్లో 70 శాతం మన దిగుబడులే . ఇదే ఊపులో 2019- 20 నాటికి 0.85 మిలియన్ మెట్రిక్ టన్నుల లక్ష్యంతో ప్రపంచలోనే రెండో స్ధానానికి చేరాలని లక్ష్యంగానిర్ధేశించుకుంది. ప్రస్తుత్తం మన దేశం నుంచి ఎగుమతి అయ్యే సముద్ర ఆహార ఉత్పత్తులో 44.5 శాతం ఆంద్ర నుంచే కావడం విశేషం. 2014 -15 లో రూ. 15 వేల కోట్ల మేర జరగ్గా .. దీన్ని 2019-20 నాటికి రూ .25 వేల కోట్లకు పెంచాలన్నది లక్ష్యం. మత్స్య రంగంంలో  మంచి దిగుబడులు సాధిస్తున్నా.. ఆశించిన మేర ఎగుమతులు ఉన్నా నాణ్యమైన పిల్లలు దొరకడం లేదు. మంచి డిమాండ్ ఉన్న పండగప్ప చేపలు , బురద పీతల కోసం తమిళనాడులోని ఆర్జిసీఏ  పై ఆధరపడల్సిన పరిస్ధితి .ఈ నేపధ్యంలో రాష్ట్రంలోనూ తల్లి, పిల్ల చేపలు, రొయ్యలు ,పితల ఉత్ప్త్తులను అభివృద్ధిచేసేందుకు రూ.105 కోట్లతో వసతులను కల్పించనున్నారు..
విశాఖపట్నం జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటలో వ్యాధులుసోకని నాణ్యమైన రొయ్యల ఉత్పత్తికి  ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కేంద్రంలో ఏడాదికి 1.5 లక్షల రొయ్య పిల్లలను ఉత్పత్తి చేయనున్నారు. రూ. 20.38 కోట్ల వ్యయం అవనుంది.దీనికి సంబంధిచి రాష్ట్రమత్య్స శాఖ , ఆర్జిసీఏ మధ్య ఒప్పందం కుదిరింది . ఇక్కడే తల్లిరొయ్యల రకాలను కూడా ఉత్పత్తి చేయనున్నారు. ఇందుకోసం మరో రూ. 40.60 కోట్లను వెచ్చించనున్నారు. ఇక్కడి నుండి ఏటా లక్ష వనామీ రొయ్యలను ఉత్పత్తి చేయనున్నారు.
అత్యధిక డిమాండ్ ఉన్న మండ పీత హేచరీని  గుంటూరు జిల్లా బాపట్ల మందలం సూర్యలంకలో ఏర్పాటుచేయనున్న దీనిపై ఎంపెడా, ఆర్జిసీఏతో ఒప్పందం కూడా అయింది. ఈ రకం పీతలు కిలో రూ. 1500 వరకు ధర పలుకుతోంది . పండుగప్పరకం చేపల ఉత్ప్త్తి కోసం నర్సరీని సూర్యలంకలో రూ. 23 కోట్లతో ఏర్పాటు చేయనున్నారు. ఇక్కడ అర్సరీ కూడా రానుంది. వీటి ధర కేజీ రూ. 600. నుంచి రూ. 800 వరకు పలుకుతోంది.ఇక్కడ ఏడాదికి 5 మిలియన్ పిల్లల ఉత్పత్తిచేసేందుకు ప్రణాళిక రచించుకున్నారు.
అనంతపురంజిల్లాలో పీఏబీఆర్ జలాశయం వద్ద తిలాపియా  అనే రకం చేపను అభివృద్ధి చేయనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా బాదంపూడిలో నాణ్యమైన చేప పిల్లలను ఉత్ప్త్తిని చేపట్టందుకు నిర్ణయించారు. అక్కడి ప్రభుత్వ చేప పిల్లల క్షేత్రంలో ఇది ఏర్పాటు కానుంది.
Source: ennadu