Page:
  1. 1
  2. 2

తెల్ల మచ్చ వ్యాధి నిర్ధారణకు అతి తక్కువ ఖర్చుతో పరీక్ష

తెల్ల మచ్చ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా వెనామీ రైతులకు నష్టాలను కలుగచేస్తున్నది. ఇండియాలోనే ప్రతి సంవత్సరం  1800 కోట్లు నష్టాలు దీని వల్ల వస్తున్నాయి. తెల్ల మచ్చ వ్యాధి సిండ్రోమ్ వైరస్ వల్ల ఈ వ్యాధి రొయ్యల్లో వ్యాపిస్తుంది. PCR టెస్ట్ ద్వారా ఈ వ్యాధిని లాబొరేటరీలో నిర్ధారిస్తారు. దీనికి 3-5 రోజుల సమయం పడుతుంది. ఈ వ్యాధిని నిర్ధారించే లోపు ఇది మరింతగా వ్యాపిస్తుంది.
20 నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ
అగార్కర్ రీసెర్చ్ ఇనిస్ట్యూట్ శాస్త్రవేత్తలు త్వరిత గతిన కేవలం 20 నిమిషాల్లో చెరువు దగ్గరే పరీక్షించుకునే విధంగా ఒక స్ట్రిప్ తయారు చేస్తారు. దీని పై రొయ్య గ్రిల్ పై ఉండే ద్రవాన్ని ఈ స్ట్రిప్ పై  వేస్తే 20 నిమిషాల్లో ఇది వ్యాధిని నిర్ధారిస్తుంది. దీని ద్వారా చాలా ముందు స్టేజ్ లోనే తెల్ల మచ్చ వ్యాధి నివారణకు అవకాశం ఉంటుంది.
ARI డైరక్టర్ కిశోర్ మాట్లాడుతూ , తెల్ల మచ్చ వ్యాధి త్వరిత గతిన అంటే కేవలం 10 రోజుల్లో మొత్తం రొయ్యలకు వ్యాపిస్తుంది.ప్రస్తుతం లాబొరేటరీలో చేసే టెస్ట్ కు ఎక్కువ సమయం మరియు నిపుణులు , పరికరాలు అవసరం  అంతేకాకుండా ప్రతి శాంపిల్ కు 1000 రూపాయలు వరకు అవుతుంది.
అతి తక్కువ ఖర్చు
ARI కనిపెట్టిన విధానంలో కేవలం 100 నుంచి 200 రూపాయల ఖర్చుతో ఒక చిన్న స్ట్రిప్ చెరువు దగ్గరే రైతు 20 నిమిషాల్లో వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. అంతేకాకుండా హాచరీ మరియు లాబొరేటరీలో కలిసి రైతులకు తప్పుడు ఫలితాలు ఇవ్వడం ద్వారా రైతులు మోసపోకుండా నివారించవచ్చు.