Page:
  1. 1
  2. 2

మత్స్య శాఖ సంపద ఎగుమతులకు ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు

మత్స్య సంపద ప్రధాన ఆదాయ వనరుగా గుర్తించిన  ప్రభుత్వం ఆ దిశగా అడుగులేస్తోంది. ఈ నేపధ్యంలో కీలకమై ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు వాడరేవును ఎంపిక చేయడంతో  ఆ ప్రాంతం దశ మారనుంది. కేంద్ర ప్రభుత్వంతీసుకున్న ఈ నిర్ణయంతో ప్రత్యక్షంగా , పరోక్షంగా జిల్లాకు , రాష్ట్రానికి మేలు జరుగుతుందని అంచనా వేస్తున్నారు. కేంద్రం 60 శాతం , రాష్ట్ర ప్రభుత్వం 40  శాతం  నిధులతో దీని నిర్మాణం చేపట్టనున్నారు. దీనికి రూ. 250 కోట్ల వ్యయం కానున్నాయి. రామాయపట్నం పోర్టు ద్వారా విదేశీ ఎగుమతులు పెరుగుతాయని  అందరూ భావిస్తున్నారు. ఆపోర్టు కంటే ముందే ఫిషింగ్ హార్బర్ సిద్దం చేసేందుకు మార్గం సుగమవుతోంది.
వాప్ కోస్ సంస్ధ బాధ్యత
కేంద్ర జలవనరుల శాఖ ఓడరేవు హార్బర్ కు సంబంధించిన సమగ్ర నివేదికను, ప్రాజెక్టు నివేదికను తయారు చేయటానికి కేంద్రప్రభుత్వ రంగ సంస్ధ ప్రతినిధులు గతంలో ఓడరేవుకు వచ్చి స్ధానిక మత్స్యశాఖధికారులతో కలిసి ఆప్రాంతాన్ని పరిశీలించారు. మత్స్యకారులు , సముద్రంలో  వేటకు వెళ్ళే అవుట్ బోట్ మోటార్లు నిర్వాహకులు , మత్స్యకార సంఘాల ప్రతినిధులు తదితరులతో నేరుగా మాట్లాడారు. ప్రాధామిక నివేదిక సమర్పించటంతో వాడరేవు లో ఫిషింగ్ హార్బర్ ఏర్పాటుకు సానుకూల వాతావరణం ఏర్పడింది.  వాప్ కోస్ సంస్ధ నిర్మాణ ప్లాన్ తో పాటు ఎన్విరాన్ మెంట్ అసెస్ మెంట్ ప్లాన్ ను తయారు చేస్తోంది. జనవరిలో డీపీఆర్నుప్రభుత్వానికి అందజేస్తుంది. రాష్ట్రంలో కావలి సమీపంలోని జువ్వలదిన్నె, వాడారేవు,నిజాంపట్నం , మచిలీపట్నం సమీపంలో గిలకదిన్నెలో కూడాఓడరేవులు ఏర్పాటు చేయటానికి సర్వేలు నిర్వహించారు. ఈ సంస్ధకు చెందిన పీటీజాయ్ ,మోహన్ జోష్, సెలబంద్, గుణసింగ్ సమగ్ర ప్రణాళిక తయారీ పనుల్లో నిమగ్నమయ్యారు.
25 ఎకరాల్లో  నిర్మాణాలు
 ఓడరేవు సముద్రతీరంలో మొత్తం 25 ఎకరాల్లో  హార్బర్ కోసం నిర్మాణాలు చేపడతారు. బోట్లు నిలపటానికి వీలుగా సముద్రం పక్కనున్న రోడ్డుకి , నీటికి మధ్యలో నిర్మాణాలు చేపడతారు. ఇన్ షోర్ హార్బర్ కోసం అంచనాలు వేశారు. ఓడరేవు ప్రాంతంలో సముద్రంలోకి వెళ్లి వేట సాగించటానికి కూడా అనువైన వాతావరణం  ఉన్నట్లు గుర్తించారు.అక్కడ 50 జెట్టీలు నిలిపేందుకు వీలుగా పార్కింగ్ సౌకర్యం కల్పిస్తారు. ఈప్రాంతంలో దాదాపు వెయ్యి  పడవలు నిలిపే అవకాశం ఉంటుంది.

సమకూరే సౌకర్యాలివే
ఫిషింగ్ హార్బర్ ప్రదేశంలో  నెట్ షెడ్ , పడవల మరమ్మతుల షెడ్ , చేపలు ఎండబెట్టుకునే ప్లాట్ ఫాం, మినీ ఐస్ ప్లాంట్, పెట్రోల్ బంకు , చేపలను నిల్వ చేసుకోవటానికి విండ్ ఎనర్జీ, సోలార్ ఎనర్జితో పనిచేసే శీతల గిడ్డంగి, వేలం షెడ్, వ్యాపారులకు ప్రత్యేకంగా  గదులు , రిటైల్ గా కొనుగోలు చేయడానికి వచ్చే వారివెంట కుటుంబ సభ్యులు, చిన్నపిల్లలు వచ్చే అవకాశం ఉన్నందున క్రష్ రూమ్,బోట్ డ్రైవర్లకు విశాంత గదులు నిర్మిస్తారు.వాహానాలు నిలుపుకోవటానికి పార్కింగ్, బోట్లకు అవసరమైన విడిభాగాల విక్రయానికి దుకాణాలు, మినీ క్యాంటిన్ , మరుదోడ్లు , కార్యాలయ భవనం ఏర్పాటు చేస్తారు. పోర్టు విభాగానికి సంభంధించిన అధికారులతో పాటు మత్స్యశాకాధికారులు అక్కడవిధులు నిర్వర్తిస్తారు. దీని నిర్వాహణకు మత్స్యకారులు, వ్యాపారులతో కలిసి ఏర్పాటు చేస్తారు.
వెయ్యి మందికి ఉపాధి
  ఫిషింగ్ హార్బర్ వల్ల ప్రత్యక్షంగా , పరోక్షంగా వెయ్యి మంది ఉపాధి  పొందుతారని అంచనా . నిజాంపట్నం ను,చి కృష్ణపట్నం వరకూ మధ్యలో ఎక్కడా ఫిషింగ్ హార్బర్ లేదు  సుమారు 230 కిలోమీటర్లకు ఇదే కేంద్రబిందువతుంది. ఇప్పటికే  జిల్లాలోని సముద్రతీరంలో చిన్నా , పెద్దవి కలిపి 800 మొకనైజ్డ్ బోట్లున్నాయి.సూర్యలంక నుంచి పెదగంజాం వరకు సముద్రంలో డీప్ ఫిషింగ్ కు అవకాశం ఉన్నట్లు గతంలోనే సర్వే ద్వారా గుర్తించారు. ఆకారణంగా ఎక్కువ మంది మొకనైజ్డ్ బోట్లు కలిసిన వారు ఈ ప్రాంతానికి వచ్చి వేట సాగిస్తారు. ఫిషింగ్ హార్బర్ ఏర్పాటైతే ఎందరికో ఉపాధి అవకాశాలు లభిస్తాయి. భవిష్యత్తులోమెరీనా బీచ్లా తయారవుతుందని అధికారులు భావిస్తున్నారు.
Source :ఈనాడు