Page:
  1. 1
  2. 2

సుస్థిర ఆక్వా సాగుతో దిగుబడులు 

కొత్తపట్నం : సుస్థిర ఆక్వా సాగుతో అధిక దిగుబడులు సాధ్యమని రొయ్యల టెక్నీషియన్ డాక్టర్ శ్రీనివాస్ అన్నారు . స్థానిక శ్రీ వెంకటరంగం శెట్టి కళ్యాణ మండపంలో మంగళవారం రొయ్యల రైతులతో మాట్లాడారు . చెరువు మొదటిదశ నుంచి చివరి వరకు పూర్తి స్థాయిలో పర్యవేక్షంచాలని కోరారు .కాలానుగుణంగా చెరువులకు తగినన్ని మోతాదులో మందులు వాడాలని సూచించారు .యాంటీబయోటిక్స్ వాడకూడదని .. అవి వాడటం వల్ల ఇత.ర దేశాలు దిగుమతులు చేసుకోవని స్పష్టం చేశారు .ఇలాంటి మందులతో ఆక్వా సాగు అంతరించే ప్రమాదం ఉందని హెచ్చరించారు .యాంటీబయోటిక్స్ పూర్తీ స్థాయిలో నిషేధించాలని సూచించారు . ఉష్టోగ్రతలు పెరిగితే మేత , మందులు వాడాలన్నారు .చెరువులోని బాక్టీరియా , వైరస్ లు చనిపోయిన తరువాత బాగా ఆరబెట్టి సాగుబడి మొదలు పెట్టాల్సి ఉంటుందని వివరించారు .కార్యక్రమంలో రొయ్యల సీనియర్ టెక్నీషియన్ రామారావు , సుధాకర్ , కుంతురి రాము  రైతులు పాల్గొన్నారు .
source : sakshi