Page:
  1. 1
  2. 2

ఉత్తమ  యాజమాన్యమే ఆక్వా సాగుకు రక్ష 

మన దేశంలో , ఆ మాట కొస్తే ఆసియా ఖండం లోనే , ఆక్వా కల్చర్ రంగంలో చిన్న , సన్నకారు రైతులదే ముఖ్య పాత్ర .తరచూ వ్యాధుల బారిన పడుతూఅతలాకుతలమవుతున్న ఉప్పునీటి రొయ్యల సాగును దీర్ఘ కాలంలో సుస్థిరత బాట పట్టించడానికి జరిగిన ప్రయత్నాల మూలంగా ఉత్తమ యాజమాన్య పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి .ఒక ప్రాంతంలో రొయ్యలు సాగు చేస్తున్న చిన్న , సన్న కారు రైతులను బృందాలుగా లేదా క్లస్టర్లుగా చేయటంతో ఈ ప్రయత్నాలు ప్రారంభవుతాయి .ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ఒక నీటి వనరు నుంచి చెరువుల్లోకి నీటిని తోడుకోవడానికి కట్టుబాటు కలిగించడం .. రైతులు వ్యక్తిగతంగా తమ ప్రయోజనాల కోసం కాకుండా ఆ ప్రాంతంలో రైతులందరి సమష్టి ప్రయోజనాల పరిరక్షణ కోసం చర్యలు తీసుకోవటం ఈ ప్రయత్నాల్లో ముఖ్యమైనవి .ఆక్వా చెరువుల ఉత్తమ యాజమాన్య పద్దతులను సమష్టిగా రైతులు అనుసరించడం మూలాన రొయ్యల దిగుబడులు పెరగడం , పర్యావరణం పై ప్రభావాన్ని తగ్గించడం , రొయ్యల నాణ్యతను మెరుగుపరచడం మార్కెట్ గొలుసులో భాగస్వాముల మధ్య సంబంధాలను మెరుగుపరచడం వంటి సత్పలితాలు వస్తున్నాయి .
ఉత్తమ యాజమాన్య పద్ధతుల్లో ఈ క్రింది అంశాలు ఇమిడి ఉన్నాయి .
1. చెరువులను సిద్ధం చేయటం 
2. రొయ్య పిల్లలను వదలడానికి నీటి యాజమాన్యం 
3. సీడ్ ఎంపికలో మెళుకువలు పాటించడం 
4. జీవ భద్రతా , రొయ్యల ఆరోగ్య యాజమాన్యంలో మెళుకువలు పాటించడం 
5. మేత యాజమాన్యంలో మెళుకువలు 
6. నీటిలో ఆక్సిజన్ నిర్వహణ 
7. పెట్టుబడి యాజమాన్యంలో మెళుకువలు 
8. పర్యావరణ పరిరక్షణ 
ఇటువంటి ఉత్తమ యాజమాన్య పద్ధతులను చిన్న , సన్న కారు రైతులకు అలవాటు చేయడం మూలంగా .. చెరువులో సమస్యలను ఎదుర్కొనే సామర్ద్యము మెరుగైన ఉత్పదకతో పాటు లాభాలు కూడా పెరిగాయి . నష్టాలను పంచిన 80% మేరకు లాభార్జన దిశగా పయనించాయి .
20 రకాల యాంటీబయోటిక్స్ , రసాయనిక పదార్ధాలను ఆక్వా చెరువుల్లో వాడుతున్నారు . ఆక్వా ఉత్పత్తుల్లో వీటి అవశేషాలు అంతార్జాతీయ వాణిజ్యంలో పెనుసవాలుగా మారుతున్నాయి . ఆక్వా చెరువుల్లో విచక్షణ రహితంగా వాడుతున్న రసాయనాల అవశేషాలు ఆక్వా ఉత్పత్తుల్లో ప్రతిపాలిస్తున్నాయి . వీటి వల్ల మనుషుల ఆరోగ్యం దెబ్బతింటున్నందున వినియోగదారుల ఆరోగ్య రక్షణకు నియంత్రణ చర్యలు తీసుకోవాల్సి వస్తోంది .
ఈ నేపథ్యంలో కాకినాడ కేంద్రంగా దేశ వ్యాప్తంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నేషనల్ సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఆక్వా కల్చర్ కేంద్ర వాణిజ్య పరిశ్రమల సంస్ధ ఉప్పునీటి రొయ్యల సాగులో సుస్ధిరతను ప్రోత్సహించడం ద్వారా పర్యావరణ్ పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది . చిన్న సన్న కారు ఆక్వా రైతులను ఒక్కతాటి మీదకు తెచ్చి సహకార సంఘాలుగా  ఏర్పాటు చేసి , చెరువులున్న రైతులనందరిని ఈ సొసైటీల్లో సభ్యులుగా చేర్చుకునేలా చర్యలు తీసుకుంటున్నాం .
రైతులు సమష్టి బాధ్యతతో వ్యవహరించేలా ప్రోత్సాహిస్తున్నాం . ప్రత్యేక క్రిమి రహిత యాంటీబయోటిక్ అవశేషాలు లేని రొయ్యలకు అంతర్జాతీయ విఫణిలో గిరాకి  ఉంది .. ఇటువంటి నాణ్యమైన రొయ్యల ఉత్పత్తికి రైతులను ప్రోత్సహిస్తున్నాము . ఈ చర్యల ద్వారా ఆక్వా రంగం సుస్ధిరతకు దేశ ఆర్ధిక వ్యవస్ద బలోపేతానికి ఎన్ .ఎ .సి.ఎస్.ఏ  దోహదపడుతుంది .

source : sakshi