Page:
  1. 1
  2. 2

ధర మెరిసినా ..... ఉసూరుమంటూ

టంగుటూరు : కరోనాతో ఆరు నెలలుగా ఎగుమతులు లేక , ధరలు రాక రొయ్యల రైతులు సతమతమయ్యారు . ఒక్కసారిగా పడిపోయిన ధరలు తాజాగా మళ్ళీ పెరిగాయి . నెల రోజుల నుంచి ధరలు పెరగటంతో రైతులు కాస్తంత ఊపిరి పీల్చుకున్నారు . ధరలు బాగున్నా రొయ్యల సాగుపై వైరస్ ల ప్రభావం పడుతోంది . మూడేళ్ళ నుంచి వరసగా వైరస్ లు దాడి చేస్తున్నాయి . వైట్ స్పాట్ , విబ్రియోసిస్ వైరస్ సోకి చెరువులు తుడిచి పెట్టేస్తుండటంతో రైతులు దిక్కు తోచని స్ధితిలో ఉన్నారు .చెరువుల్లో సీడ్ వేసిన 40 నుంచి 60 రోజులకే  వైరస్ లు సోకి రొయ్యలు చనిపోతున్నాయి . ఈ నేపథ్యంలో ధరల పెరుగుదల రైతులకు కాస్తంత  ఊరటనిస్తోంది .
జిల్లాలో టంగుటూరు , సింగరాయకొండ , చినగంజాం , చీరాల ఉలవపాడు , గుడ్లూరు , కొత్తపట్నం , వేటపాలెం , ఒంగోలు మండలాలు పరిధిలో సుమారు 25 వేల ఎకరాలకు పైగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు .రొయ్యపిల్లల నాణ్యత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో చెరువుల్లో మోర్టాలిటీ  శాతం తగ్గి చెరువుల్లో రొయ్య బతుకుదల శాతం పెరిగింది . అయితే వాతావరణ మార్పుల వల్ల కొన్ని రోజులగా వైట్ స్పాట్ విబ్రియోసిస్ వైరస్ లతో చెరువులు అర్ధాంతరంగా తుడిచి పెట్టుకుపోతున్నాయి . ఇటీవల కురిసిన భారీ వర్షాలు ఆక్వా రంగానికి ప్రతికూలం గా మారాయి . వైట్ స్పాట్ , విబ్రియోసిస్ వైరస్ లు సోకడంతో రొయ్యలు ఎరుపు రంగుకు తిరిగి చనిపోతున్నాయి ఈ సంవత్సరం ఉత్పత్తి తగ్గడంతో ధరలకు రెక్కలు వచ్చాయి .
నెల రోజుల వ్యవధిలో టన్ను రూ . 40 వేలకు పెరుగుదల : రొయ్యల ధరలు ఒక్క సారిగా పెరగటం వెనుక అనేక కారణాలున్నాయి .ఉష్ణోగ్రతలు రోజురోజుకూ మారడం , వైరస్ ల తాకిడి ఎక్కువగా ఉండటంతో సాగులో ఉన్న రొయ్యల చెరువులు అర్ధాంతరంగా తుడిచి పెట్టుకుపోతున్నాయి . పంట ఉత్పత్తి తగ్గడంతో వ్యాపారులు ధరలను ఒక్కసారిగా పెంచారు
source : sakshi