Page:
  1. 1
  2. 2

వస్తోంది ... అప్పలు చేప

 విశాఖ పట్నం : ఉప్పు నీటిలో పెంచుకొనే మరో చేపను సముద్ర మత్స్య పరిశోధన కేంద్రం సంస్ధ అధికారులు సిద్ధం చేశారు .గత మూడున్నర సంవత్సరాలుగా సాగుతున్న పరిశోధనలు , అధ్యయనాలు కొలిక్కి వచ్చాయి .వీటిని త్వరలోనే చేపల పెంపకందారులకు అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు .విశాఖలోని సి .ఎం.ఎఫ్ఆర్. సంస్ధ తాజాగా 'అప్పలు ' అనే రకం చేపను అందుబాటులోకి తెచ్చింది .వాస్తవానికి ' అప్పలు '  జాతి చేపలు సముద్ర అంతర్భాగంల్లో  రాళ్ల మధ్య కాలం గడుపుతుంటాయి .వేటకు వెళ్లే వారికి చాలా అరుదుగా దొరుకుతాయి . తక్కువ ముళ్లు , ఎక్కువ రుచితో ఉండే ఆయా చేపలకు మార్కెట్లో మంచి గిరాకీ ఉంటోంది . కేజీ రూ .400 నుంచి రూ .450  వరకు ధర పలుకుతోంది .దీంతో శాస్త్రవేత్తలు కొన్ని నెలల పాటు శ్రమించి సుమారు 20 కు పైగా ఆడ , మగ ' అప్పలు ' జాతి చేపల్ని సముద్రం నుంచి సేకరించారు . డాక్టర్ రితేశ్  రంజన్ , డాక్టర్ శేఖర్ మెగరాజన్ , డాక్టర్ బిజి జేవియర్ , డాక్టర్ శుభ దీపగోస్ లు భారత్ బయో టెక్నాలజీ విభాగం నుంచి ఒక ప్రాజెక్టు పొంది ఆ చేపలను కృత్రిమంగా  పెంచే విధానంపై పరిశోధనలు చేశారు .15 శాతానికి మించి పి .పి.టి  ఉప్పుదనం ఉన్న సముద్ర నీటిలో అవి బాగా పెరుగుతున్నట్లు గుర్తించారు ఏ ఆహారాన్ని వాటికి అందించాలన్న అంశాలను కూడా తెలుసుకున్నారు . చేపలకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇచ్చి ఆడ , మగ చేపలు పరస్పరం ఆకర్షితులయ్యేలా చేశారు .' అప్పలు ' జాతి ఆడ చేపలు గుడ్లు పెట్టేలా చేయడంలో విజయం సాధించారు . ఆయా గుడ్లను వేరు చేసి అవి పిల్లలుగా ఎదుగడానికి అనువైన వాతావరణాన్ని ప్రయోగశాలలోని హేచరీలో అభివృద్ధి  చేశారు .శాస్త్రవేత్తల కృషి ఫలించడంతో సుమారు 20 వేల  వరకు చేప పిల్లలు  బతికాయి .2 నెలల నుంచి అవి సజీవంగా ఉండటంతో ప్రయోగం విజయవంతమైనట్లు నిర్ధారించుకున్నారు . సంవత్సరం వ్యవధిలో అవి కేజీకి పైగా బరువు పెరుగుతాయని భావిస్తున్నారు . ఒక్కో చేప మూడు నుంచి మూడున్నర కేజీల బరువు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు .