Page:
  1. 1
  2. 2

చేప , రొయ్య రైతులకు కనీస గిట్టుబాటు

చేప , రొయ్య రైతులకు కనీస గిట్టుబాటు ధర కల్పించనున్నట్లు ముఖ్యమంత్రి 
వైస్ జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు . ఆక్వా ఉత్పత్తులకు ధరల స్థిరీకరణ అమలు కోణంలో ఆలోచించాలని అధికారులను ఆదేశించారు . చరిత్రలో మొదటి సారిగా పొగాకు ధరల స్థిరీకరణ కోసం కూడా నిధులు ఖర్చు చేశామన్నారు . రైతుల పంటలకు కనీస గిట్టుబాటు ధర కల్పించేందుకు దాదాపు రూ .3200 కోట్లు ఖర్చు చేశామని చెప్పారు . దీని వల్లే దళారుల నుంచి ఆ రైతులను కాపాడగలిగామని , లేదంటే వారు త్రీవంగా నష్టపోయేవారని తెలిపారు . పశుసంవర్ధక , మత్స్య శాఖల కార్యకలాపాలపై గురువారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో ఉన్నత స్థాయి సమీక్ష సీఎం జగన్ ఏమన్నారంటే .
వ్యూహాత్మక  విధానం  అనుసరించాలి 
1. రొయ్యలు , చేపలు సాగు చేస్తున్న వారికి ఏ రకంగా రక్షణ కల్పించాలన్న దానిపై ఆలోచించాలి .వారికి కనీస గిట్టుబాటు ధర వచ్చేలా ప్రభుత్వ యంత్రాంగం వ్యూహాత్మక విధానం అనుసరించాలి .
2. ప్రీ ప్రైమరీ ప్రాసెసింగ్ నుంచి సెకండరీ ప్రాసెసింగ్ వరకు ప్రభుత్వం వైపు నుంచి మౌలిక సదుపాయాలను కల్పించాలి .ఆక్వా ఉత్పత్తుల కోసం ప్రీ ప్రాసెసింగ్ , ఐ క్యూఏష్  , కోల్డ్ స్టోరేజ్ సదుపాయాలు కల్పించాలి . 
3. వాటిని జనతా బజార్లకు అనుసంధానం చేయాలి .దీనివల్ల ప్రైవేట్ వ్యక్తులు సిండికేట్ కాకుండా రైతులకు భరోసా ఇవ్వగలుగుతాం .
జనతా బజార్ల పై దృష్టి పెట్టాలి .
 వచ్చే ఏడాదిలో ఆర్బీకే  స్థాయిలో  జనతా బజార్లను ప్రారంభించడంపై అధికారులు సీరియస్ గా దృష్టి పెట్టాలి .గ్రామ స్థాయిలో గోడౌన్లు , మండల స్థాయిలో కోల్డ్ స్టోరేజ్ వస్తున్నాయి .గ్రేడింగ్ , ప్రైమరీ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు వస్తున్నాయి . మేజర్ క్రాప్ నకు సంబంధించి సెకండరీ ప్రాసెసింగ్ సెంటర్లు కూడా వస్తున్నాయి .
వెబ్ అప్లికేషన్ ప్రారంభం 
1. రైతు భరోసా కేంద్రాల ద్వారా మత్స్యశాఖకు సంబంధించిన ఇ-క్రాప్  బుకింగ్ , వైస్సార్  మత్స్య సాగుబడి , కిసాన్ క్రెడిట్ కార్డులు వంటి ముఖ్యమైన సర్వీసులకు సంబంధించిన వెబ్ అప్లికేషన్ సీఎం జగన్ ప్రారంభించారు .
2. సమీక్ష లో మంత్రి డాక్టర్ సిదిరి  అప్పలరాజు , వ్యవసాయ పశు సంవర్ధక , మత్స్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య , ఫిషరీస్ కమిషనర్ కన్నబాబు ఆయా శాఖల ఉన్నతాధికారుల పాల్గొన్నారు .
source : sakshi