Page:
  1. 1
  2. 2

ఆక్వా రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డులు

 అమరావతి : ఆక్వా , దాని అనుబంధ రంగాల్లోని వారందరికీ  కిసాన్ క్రెడిట్ కార్డులు  జారీ చేసి రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది . మత్స్య సంపద విక్రయించే వారికి , సముద్రంలో చేపల వేటకు వెళ్లే వారికి కూడా రుణాలు ఇచ్చేలా చర్యలు తీసుకుంది . ప్రకృతి వైపరీత్యాలు , రొయ్యలు , చేపలకు , సంక్రమించే వ్యాధుల కారణంగా ఆక్వా రైతులు స్ధిరమైన ఆదాయం పొందే అవకాశం లేకపోవడంతో బ్యాంకర్లు ఇప్పటి వరకు పెద్దగా రుణాలివ్వలేదు .
రైతు భరోసా కేంద్రాల్లో దరఖాస్తుల స్వీకరణ  
1 . రుణాలు పొందగోరే చేపలు , రొయ్యల సాగుదారులు , కౌలుదారులు మత్స్య సంపద విక్రేతలు , సముద్రంలో వేటకు వెళ్లే మర పడవలు , సంప్రదాయ పడవల నిర్వాహకులు రైతు భరోసా కేంద్రాల్లో మత్స్య సహాయకులు సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచిస్తోంది .
 2 .ఆక్వా కౌలుదారులు భూ యజమానులు అనుమతి లేఖతో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది . వారికి మేత  మందుల కొనుగోలుకు బ్యాంకులు రుణాలు మంజూరు చేస్తాయి .మత్స్యకార సహకార సంఘాల్లోని సభ్యులు తమ సంఘం పేరు టర్నోవర్ తో కూడిన వివరాలను దరఖాస్తులో పేర్కొనాలి .ఆ సంఘం ఇచ్చే ష్యురీటిని ఆధారం చేసుకుని సభ్యులకు బ్యాంకులు రుణాలు ఇస్తాయి . సముద్రంలో చేపల వేటకు వెళ్లే మత్స్యకారులకు కూడా కిసాన్ క్రెడిట్ కార్డులు ఇవ్వనున్నారు .
3.సాగుదారులు రూ . 3 లక్షలు వరకు స్వల్పకాలిక రుణాలు తీసుకోవచ్చు . భూమి లేని రైతులకై తే ఎటువంటి హామీ లేకుండ రూ .1.60  లక్షల వరకు రుణం ఇస్తారు .ఈ రుణాలపై 9 శాతం వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయించింది .సకాలంలో రుణం చెల్లించే రైతులకు 5 శాతం వడ్డీ రాయితీ  లభిస్తుంది .
source : sakshi