Page:
  1. 1
  2. 2

రొయ్యల' సీమ ' 

ప్రొద్దుటూరు : రాళ్లురప్పలతో కరువు ప్రాంతాన్ని తలపించే రాయలసీమ ... నేడు రొయ్యలు , చేపలు వంటి మత్స్య సంపదతో కళకళలాడుతుంది . వైస్సార్ జిల్లా చాపాడు మండలమైతే చేపల చెరువులతో కోనసీమను తలపిస్తోంది .ఒక్క రైతుతో 30 ఎకరాల్లో మెదలైన సాగు క్రమంగా వందల ఎకరాలకు విస్తరిస్తోంది .వివిధ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్ వంటి దేశాలకు సైతం ఇక్కడి రొయ్యలు , చేపలను ఎగుమతి చేస్తున్నారు .ప్రభుత్వ ప్రజాప్రతినిధుల సహకారంతో మరింత మంది రైతులు ఆక్వా సాగుకు ముందుకు వస్తున్నారు .
బీమవరం టూ వైస్సార్ జిల్లా 
ఎన్నికలకు ముందు వైస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా మైదుకూరు ఎమ్మెలే రఘురామిరెడ్డి  తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పర్యటించారు .ఆ సందర్భంగా అక్కడి రైతులతో రొయ్యలు , చేపల సాగు గురించి ఆరా తీశారు .అదే సమయంలో పోరుమామిళ్ల మండలం ఎరసాల గ్రామానికి చెందిన కల్లూరి భాస్కర్ రెడ్డి భీమవరం ప్రాంతంలో చేపలు , రొయ్యలు సాగు చేస్తున్నాడని తెలుసుకొని ఎమ్మెల్యే ఆయన ఇంటికి వెళ్లారు .మన ప్రాంతంలో వీటిని సాగు చేస్తే బాగుంటుందని , ఇందుకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని భాస్కర్ రెడ్డికి ఎమ్మెల్యే హామీ ఇచ్చారు .ఆ మేరకు చాపాడు మండలం లోని అనంతపురం కుచ్చు పాప గ్రామాల మధ్య తనతో పాటు తన బంధువులు , గ్రామస్తులకున్న భూములను భాస్కర్ రెడ్డికి ఎమ్మెల్యే లీజుకు ఇప్పించారు .ఆయన తొలుత 30 ఎకరాల్లో చేపలు , రొయ్యల సాగును ప్రారంభించి ప్రస్తుతం 100 ఎకరాలకు పైగా విస్తీర్ణానికి పెంచారు . రొయ్యల సాగును కూడా చేపట్టి విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు .సీతల్  రకాల చేపలను సాగు చేస్తున్నారు .కుందూ నదీ  పరివాహక ప్రాంతంలో ఈ భూములు ఉండగా నీటి లభ్యత కోసం మోటార్లను ఏర్పాటు చేసుకున్నారు .ఆరు అడుగుల మేర నీరు నింపి పలు చోట్ల చెరువులను తయారు చేశారు .దూర ప్రాంతాల నుంచి కార్మికులను తెచ్చుకొనవసరం లేకుండా ఈ ప్రాంతాల్లోని వారికే శిక్షణ ఇచ్చి నియమించుకున్నారు .ఇక్కడ 8 కిలోల  వరకు చేపలు పెరుగుతున్నాయి .ఇతర రాష్ట్రాలతో పాటు సీతల్ రకం  బంగ్లాదేశ్ ఎగుమతి చేశారు
source : sakshi