Page:
  1. 1
  2. 2

పిల్లలు ఎంపిక మరియు స్టాకింగ్

•స్టాకింగ్ చేసే పిల్లలకు ముందుగా సాంప్రదాయ మరియు మోలిక్యులార్ పరీక్షల ద్వారా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలి.
•ఒకే సైజులో వుండి చురుకుగా నీటి ప్రవాహమునకు ఎదురీదే పిల్లలను ఎంచుకోవాలి.
•పిల్లలను ఫార్మలిన్ స్ట్రెస్ టెప్ట్ ద్వారా 15 నుండి 20 నిమిషాలు ఎయిరేషన్ చేస్తూ నీటిలో పరీక్ష నిర్వహించాలి.
•ఎంచుకున్నపిఎల్ లను 15-20 రోజులు నర్సరీలో పెంచాలి.
•స్టాకింగ్ జరిపే సమయంలో చెరువులలో నీరు లేత ఆకుపచ్చ రంగులో ఉండాలి. నీరు పారదర్శకంగా వుండరాదు.
•పిల్లలను అధికారులు సూచించిన కాలంలో స్టాకింగ్ జరపాలి.
•పెంపకపు కాలంలో రొయ్యలకు వ్యాధులు సోకటం మరియు సోకిన వ్యాధులను క్రొత్తగా స్టాక్ చేసినపిల్లల బ్యాచ్ కు వ్యాప్తి చెందడం జరగకుండా ఒకే ప్రాంతంలో ఉన్న చెరువులలోఆరోగ్యకరమైన రొయ్యపిల్లలను ఒఏసారి స్టాకింగ్ చేయాలి.