Page:
  1. 1
  2. 2

రొయ్యకు మద్దతు ధర 

జిల్లాలో ఆక్వా ఉత్పత్తులకు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేయాలని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు . కోస్తా జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి బుధవారం నిర్వహించిన వీడియో సమావేశానికి హాజరైన అనంతరం కలెక్టర్ మత్స్యశాఖ అధికారులకు పలు సూచనలు చేశారు . జిల్లాలో ఆక్వా రైతులకు మద్దతు ధర లభించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు . అమ్మకాల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు . జిల్లాలో ఆక్వా పుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏడుఉండగా వాటిల్లో నాలుగు పని చేస్తున్నాయాన్నారు . మిగిలిన యూనిట్లను కూడా పనిచేయించేలా చర్యలు తీసుకోవాలన్నారు . ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలను ప్రతి గ్రామ పంచాయతీ వద్ద ప్రదర్శించాలన్నారు. ధరల విషయంలో ఏవైనా ఫిర్యాదులుంటే సంబంధిత మత్స్యశాఖ అధికారులకు తెలియజేసి పరిష్కారం పొందాలని ఆక్వా రైతులకు సూచించారు .
ఫిర్యాదులు స్వీకరించే అధికారులు 
టి. పూర్ణయ్య  , ఏడీ, మచిలిపట్నం . - 9985447405 
పి . సురేష్ ,  ఏడీ,అవనిగడ్డ             - 9440341243 
సీ హెచ్ చక్రాణీ , ఏడీ, విజయవాడ    -  9848945191 
కె . నాగలింగాచారి , ఏడీ, గుడివాడ    - 9440814733 
డీఎస్ సుధాకర్ , ఏడీ,కైకలూరు .      -  9849042124 
సీహెచ్ నాగబాబు , ఏడీ, బంటుమిల్లి . – 7702703462
Source : eenadu