Page:
  1. 1
  2. 2

ఆక్వానందం 

రొయ్య రైతుకు వై.యస్.జగన్ సర్కార్ భరోసా 
ఎన్నికలలో ఇఛ్చిన హామీ మేరకు కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ఆదుకొనేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది . గత ప్రభుత్వం హయాంలో ఉన్న యూనిట్ విద్యుత్తు ఛార్జిని  రూ.1.50 కు తగ్గిస్త్తూనిర్ణయం తీసుకుంది . ఈ మేరకు మంగళవారం జీఓఆర్టీ నంబర్ 70 విడుదల చేసింది .  దేని వల్లరొయ్యల చెరువులు సాగు చేస్తున్న రైతుల విద్యుత్తు చార్జీలు మరింత తగ్గనున్నాయి . జిల్లా పరిధిలో వేటపాలెం , ఒంగోలు , కొత్తపట్నం, సింగరాయకొండ, టంగుటూరు , చినగంజాం, చీరాల, ఉలవపాడు , గుడ్లురు, నాగులుప్పలపాడు , జరుగుమల్లి మండలాల్లో 28 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు . వీటి పరిధిలో 250 కేటగిరి -3  సర్వీసులు  ఉన్నాయి గత టీడీపీ ప్రభుత్వం రొయ్యల చెరువుల . విద్యుత్తు చార్జీలు యూనిట్ కు రూ.3.86 చొప్పున నాలుగేళ్లపాటు వసూలు చేసింది . ఎన్నికల ముందు వై. యస్. జగన్ హామీ ఇఛ్చిన తర్వాత ఛార్జి రూ.2 కు తగ్గించింది దీని వల్ల పంట కాలానికి రూ.60 వేలు విద్యుత్తు ఛార్జిని కట్టాల్సి వస్తోంది . జగన్ సర్కార్ యూనిట్ కు మరో 50 పైసాలు తగ్గించడం వల్ల ఒక్కో ఎకరానికి నాలుగు నెలల  పంట కాలానికి విద్యుత్తు ఛార్జి రూ.45 వేలకు తగ్గుతుంది.దీని వల్ల ఒక పంట కాలానికి రూ .15 వేలు తగ్గుతున్నాయి  లెక్కన జిల్లా లో28 వేల ఎకరాల్లో ఉన్న రొయ్యలు చెరువు సాగుకు ఒక పంటకు రూ.42 కోట్ల విద్యుత్తు చార్జీలు తగ్గనున్నాయి . ఈ లెక్కన రొయ్య  రైతుకు ఒక పంటకు రూ .42 కోట్లు మిగిలినట్లే లెక్క . దింతో రొయ్య రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది .
మాట నిలబెట్టుకున్న జగన్ ...
అసలే రొయ్యకు గిట్టుబాటు ధరలేక రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్ధితుల్లో  వై.యస్. జగన్ సర్కార్ విద్యుత్తు ఛార్జి
భారం తగ్గించడం పై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది . ఆక్వా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు . ఏడాది క్రితం వరకు విద్యుత్తు ఛార్జిభారం రూ.3.86గా ఉంది.  తగ్గించాలని రైతాంగం నెట్టి నోరు బాదుకున్నా నాలుగేళ్లపాటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు . దింతో భారం భరించలేక రైతులు రొయ్యల సాగు కు స్వస్తి చెప్పాల్సి వచ్చింది .దింతో జిల్లాలో రొయ్యల సాగు మరింతగా తగ్గింది . రైతులు పలుమార్లు విద్యుత్తు ఛార్జిలు తగ్గించాలని కోరారు . అప్పట్లో చంద్రబాబు  పట్టించుకోకపోవడంతో అప్పటి ప్రతిపక్ష నేత  
 వై.యస్. జగన్ మోహన్ రెడ్డి ని కలిసి విద్యుత్తు ఛార్జిలు తగ్గించాలని రైతులు కోరారు . వారి సమస్యలను పరిశీలించిన వై.యస్. జగన్ అధికారంలోకి వఛ్చిన వెంటనే యూనిట్  విద్యుత్తు ఛార్జిలను రూ.1.50 కి తగ్గిస్తానని హామీ ఇచ్చారు ఆ మేరకు విద్యుత్తు ఛార్జి తగ్గిస్తూ జిఓ జారీ చేసి హామీని నెరవేర్చారు సీఎం జగన్ మాట నిలబెట్టుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.
Source: sakshi