Page:
  1. 1
  2. 2

ఆక్వా సాగు ఇలా చేస్తే మేలు

నేల  స్వభావం ముఖ్యం

శిల్పికి  రాయి , వడ్రంగికి చెక్క స్వభావాలు తెలిస్తే , వారు మెరుగైన పని తీరును  ప్రదర్శించగలిగినట్లే.. రైతుకు నేల గురించి తెల్సి ఉండాలి .ఆక్వా సాగుకు నేల చాలా ముఖ్యం . కైకలూరు  మండలం వేమరప్పాడుకు చెందిన రైతు చేపల సాగులో లాభాలు వస్తున్నాయని , తన నాలుగు ఎకరాల భూమిని చెఱువుగా తవ్వించారు । కట్లా కట్ రకం చేప పిల్లలను వేసి మేటలు వేసి పెంచారు. రెండేళ్ల పాటు పెంచినా చేపలు పెట్టుబడికి రాలేదు . పెట్టుబడి పెరిగి పోయి చేపలు పెట్టుబడికి రాక త్రీవంగా నష్టపోయాడు . మత్స్య శాఖ అధికారులను ఆశ్రయించాడు . నేలలో సారం లేకపోవడమే కారణంగా చెప్పారు . సారం లేని భూమిలో చేపల సాగు  చేయకూడదనే కొద్దిపాటి అవగాహన లేక పోవడంతో ఆ రైతు రూ. లక్షల్లో నష్టం మూత కట్టుకున్నారు .

మేతల పై ఏది అవగాహన

ఆక్వా సాగులో మేతలు  చాలా కీలకం , రొయ్యల ఎదుగుదలకు పలు రకాల మేతలను వినియోగిస్తున్నారు . ఈ మేతల్లో ప్రోటీన్లు 21 నుంచి 24 శాతం ఉండాలి .కొవ్వులు  మూడు శాతం , పీచు7  శాతం ఉండాలి .ఆక్వాలో రైతులు మేటలుగా తవుడు , చెక్క ,సోయా చెక్క ,పత్తి  పిండి వంటి వాటిని వాడుతున్నారు . మేతలు ఎప్పుడు నీటిలో వేసినా వెంటనే కరగకూడదు . అలా కరిగిపోయిన మేతలు  నీటి అడుగున పేరుకుపోతాయి . తక్కువ ధరకు వస్తున్నాయని పలు రకాల మేతలను , నాసి రకం మేతలను   వాడటం సరికాదు . ఇలా చేయడం వాళ్ళ చేపలు బరువు పెరుగక పోగా ఖర్చు పెరుగుతుంది .

ఎరువుల వాడకం

ఆక్వా సాగులో భూసారం పెరిగేందుకు .. ఎరువులు వాడుతారు . అయితే అవసారానికి మించి ఎరువులను వాడితే రైతుకు నష్టాలు తప్ప ప్రయోజనం ఉండదు । .సాధారణంగా సూపర్ ఫాస్ప్ ట్ , డీఏపీ  ఎరువులను వాడుతుంటారు వీటి ధర ఎక్కువని ... కొందరు రైతులు కోళ్ల  ఎరువు , పేడను వాడుతుంటారు . వీటి వల్ల  హానికర బాక్టీరియా పెరిగి చేపలు , రొయ్యల్లో వ్యాధులు వస్తుంటాయి . వీటిని తగ్గించడం కోసం మందులను వాడాల్సి వస్తుంది . ఇలా అవసరం లేక పోయినా ఎరువులు , కోడి పెంట వాడటం వల్ల రైతులకు వృదా ఖర్చులు పెరిగి , నష్టాలకు గురవుతుంటారు .

ఉష్టోగ్రతలు , వాతావరణ ముఖ్యం

ఆక్వా సాగులో బాహ్య ఉష్ణోగ్రతలు  ,వాతావరణ మార్పులు గమనిస్తుండాలి .వేసవిలో అకస్మాత్తుగా సంభవించే వాతావరణ మార్పుల వల్ల టన్నుల కొద్దీ చేపలు ఆక్సిజన్ సమస్యతో మృతి చెందుతుంటాయి . రైతులకు త్రీవ నష్టాలను మిగుల్చుతాయి . రెండేళ్ల క్రితం చేపల రైతుల సంఘం రాష్ట్ర అధ్యషుడు ముదునూరి సీతారామరాజు చెరువులో డివో సమస్య వఛ్చి  రూ . కూటి పైగా నష్టం వాటిలింది . వేసవిలో కాస్త జాగ్రత్తగా ఉంటె డివోసమస్యను అధిగమించవచ్చు . పడిపోతున్న ఆక్సిజన్ స్థాయిని పెంచడానికి పలు రకాల రసాయనాలు అందుబాటులో ఉన్నాయి .

రసాయనాల వాడకం

అర్హత , అనుభవం ఉన్న నిపుణుల సలహాలను మాత్రమే రసాయనాలను వాడాల్సి ఉంటుంది . అనవసరమైనరసాయనాల వాడకం వల్ల ఖర్చు పెరగడం తప్ప ప్రయోజనం ఉండదని గమనించాలి .

డి . సాల్మన్ సుధాకర్ మత్స్యశాఖ సహాయ సంచాలకులు , కైకలూరు చరవాణి :   9849042124

Source : eennadu

www.aquall.in