Page:
  1. 1
  2. 2

రోగాల రొయ్య

ఆరేళ్ళ క్రితం ఒక ఊపు ఊపిన ఆక్వా సాగు నేడు ఆటుపోట్లతో కొట్టుమిట్టాడుతోంది . ప్రస్తూత  పరిస్థితుల్లో  రైతులు ఆక్వా సాగు  అంటేనే భయపడాల్సిన పరిస్థితి  వచ్చింది సాగు బాగున్నపుడు ధరలు తగ్గించడం , తక్కువగా ఉన్నపుడు ధరలు పెంచేస్తూ వ్యాపారులు మాయాజాలం ప్రదర్శిస్తున్నారు మరో వైపు రొయ్యలకు వైరస్ సోకి తుడిచిపెటేస్తుండటంతో రైతులు దిక్కుతోచని పరిస్ధితుల్లో ఉన్నారు .చెరువులో సీడ్ వేసిన 50  నుంచి 70 రోజులోనే వైరస్ సోకి రొయ్యలు చనిపోవడంతో రైతులు దిగాలు పడుతున్నారు . వ్యాపారులు కూటమి కట్టి ఒక వైపు ధరలు తగించడం మరో సమస్య .
టంగుటూరు : జిల్లాలో సముద్ర తీరా ప్రాంతాలైన టంగుటూరు , సింగరాయకొండ, చినగంజాం, , చీరాల, ఉలవపాడు , గుడ్లూరు, కొత్తపట్నం , వేటపాలెం , ఒంగోలు మండలాల పరిధిలో సుమారు 25 వేళా ఎకరాలకు పైగా రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. రొయ్య పిల్ల నాణ్యత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతో రొయ్యల బతుకుదల శాతంపెరిగింది . కాని వాతావరణ మార్పులు ఆధారంగా గత కొన్ని రోజులుగా వైట్ స్పాట్ , విబ్రియోసిస్  వైరస్ సోకడంతో  చెరువుల్లో రొయ్యలు అర్ధాంతంగా తుడిచిపెట్టుకుపోయాయి  ఒక వేళకాలం కలిసి వఛ్చి పంట వచ్చిన వ్యాపారులు తక్కువ ధరకే కొనుగోలు చేస్తుండటంతో  ఆక్వా రైతును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది ఇటీవల కురిసిన వర్షంతో వైరస్ లు విజ్రంభించి .... రొయ్యలు ఎరుపు రంగుకు తిరిగి చనిపోతున్నాయి . దింతో సరైన కౌంటు  రాకుండానే పెట్టుబడులు చేయాల్సిన పరిస్ధితి ఏర్పడింది .ఒక్క సారిగా పెట్టుబడి పెరగడంతో ప్రాసెసింగ్ కేంద్రాలు , ఎగుమతిదారులు తాము సరుకు కొనుగోలు చేయలేమంటూ చేతులెతేయిస్తా  పరిస్ధితి . దీనికి తోడు పెట్టుబడిలో చిన్న రొయ్యలు అధికంగా ఉండటంతో ఎగుమతి దారులు , ప్రాసెసింగ్ కేంద్రాల నిర్వాహకులు కూటమికట్టి రైతుల వద్ద ఉంచే తక్కువ ధరకే కొనుగోలు చేస్తున్నారు చిన్న రొయ్యలను చెన్నె , బెంగుళూరు , ముంబై ప్రాంతాలకు విక్రయిస్తున్నారు రొయ్యలూనిల్వ చేసుకునే శీతల గిడ్డంగులు ఇలాంటి సమయాల్లో తమకు వెసులుబాటు ఉండదనే రైతులు వాపోతున్నారు . ప్రస్తుతం రొయ్యల సాగులో ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయి . ధరచూస్తే నెల వ్యవధిలో తన్నుకు సరాసరిన రూ. 40 వేలు తగ్గిపోయింది .

source : eenadu