Page:
  1. 1
  2. 2

రొయ్యను పీడిస్తున్న నిషేధిత మందులు

రొయ్యల సాగులో నిషేధిత యాంటీబయోటిక్స్ వాడకాన్ని నియంత్రించడం కత్తిమీద సాములా తయారైంది.ఒకటా.. రెండా ఏకంగా 600 రకాలపై ఉత్పత్తులను మన రైతులు రొయ్యల సాగులో వినియోగిస్తున్నారు. వీటిని కట్టడి  చేసేందుకు వివిధ శాఖలతో కూడిన అధికారులు బృందాలుగా ఏర్పడి విసృత దాడులు నిర్వహిస్తున్నారు.అయితే వాటిలో నిషేధిత మందులు  అవశేషాలు నిర్ధరించేందుకు అవసరమైన పరీక్షా కేంద్రాలు రాష్ట్రంలో  లేవు . అనుమానిత ఉత్పత్తులను  చైన్నె పంపి అక్కడి నుంచి ఫలితాలు వచ్చేవరకు ఎదురు చూడాల్సి వస్తోంది.. ఈ లోగా చెరువుల్లో వినియోగం యద్ధేచ్చగా జరుగుతోంది. కొన్ని మందులు గుర్తించినా చట్ట పరిధిలో సాధ్యం కావడంలేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
11 బృందాలు ...  నిషేధిత యాంటీబయోటిక్స్ అవశేషాల కారణంగా రొయ్యల కంటెయినర్లు విదేశాల నుంచి వెనక్కు వస్తుండడంతో మత్స్య శాఖ, ఎంపెడా ,ఔషధ నియంత్రణ శాఖలు చర్యలు ప్రారంభిచాయి. 9 జిల్లాల పరిధిలో రెవెన్యూ , పోలిసుశాఖల సహకారంతో మందుల అమ్మకపు దుకాణాలు, హేచరీలు, రొయ్యల చెరువుల్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 12 దుకాణాల్లో , 2 హేచరీల్లో నిషేధిత మందులను గుర్తించి మొదటి తప్పుగా రూ. 25 వేల  చొప్పున జరిమానా విధించారు. తూర్పు గోదావరీ, నెల్లూరు జిల్లాల్లోసరైన ప్రమాణాలను పాటించని 25 హేచరీలు సీజ్ చేశారు. 
పరీక్షకు ఎన్ని కష్టాలో.... ఇబ్బడి ముబ్బడి గా అమ్ముతున్న ఉత్పత్తుల ప్యాకెట్లలో ఏం కలిపి విక్రయిస్తున్నారో కూడా ముద్రించడం లేదు. కొన్నింటిని ఎక్కడ తయారు చేస్తున్నారో కూడా తెలియని పరిస్ధితి నెలకొంది. ఔషధ నియంత్రణ శాఖ అనుమతిచ్చిన దుకాణాల్లొ కొన్ని మందులను గుర్తిస్తున్నా పరీక్ష కేంద్రానికి పంపాలంటే సంబంధిత యజమాని సంతకం తీసుకోవాలి.పంచనామా నిర్వహించాలనే తతంగం ఉంది.
1.    అనుమానిత మందులను పరీక్షించి అందులో ఏముందో నిర్ధరించే సాంకేతిక పరిజ్ఞానం ఆంధ్రప్రదేశ్ లో లేదు . హైదరాబాద్ లోని ఈ పరీక్షకేంద్రం తెలంగాణా ఆధీనంలో ఉంది. విజయవాడలో కేంద్రం ఉన్నా అక్కడ అన్ని సౌకర్యాలు లేవు.
చట్ట అంగీకరించదు:  ప్రో బయోటిక్స్ లో కొన్ని మందులు ఔషధ నియంత్రణ శాఖ పరిధిలోకి రావు . దీంతోఏమీ చేయలేని పరిస్ధితి నెలకొంది. వీటిని అనుమానిత మందులుగానే గుర్తిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా రొయ్యల సాగు పర్యవేక్షించే మత్స్య శాఖకు అసలు వీటిపై చర్యలుతీసుకునే అధికారమే లేదు దీంతోఅధికారులు తమకు ఉన్న పరిమితి మేరకేదాడులు నిర్వహిస్తున్నారు.ఈ సందర్భంగా మత్స్య శాఖ అదనపు డైరెక్టర్ సీతారామరాజు మాట్లాడుతూ .. విదేశాల నుంచి ఆంక్షల నేపధ్యంలో రొయ్యల సాగులో నిషేధిత మందుల వాడకాన్ని నియంత్రించేందుకు తనిఖీల్ ముమ్మరం చేశామన్నారు. ఇప్పటి వరకు22 చోట్ల దాడులు నిర్వహించామని చెప్పారు. పరీక్షలకు మన రాష్ట్రంలో అవకాశం లేకపోవడంతో ఫలితాల్లో కొంత జాప్యం జరుగుతొందని పేర్కొన్నారు.
Source : eenadu