Page:
  1. 1
  2. 2

వెనామీ సాగులో రైతు అనుభవం

రొయ్యల సాగులో విత్తన ఎంపిక నుంచి పట్టుబడి వరకు ఎప్పటీకప్పుడు జాగ్రత్తలు తీసుకుంటేనే లాభాలు వస్తాయి. వెనామీ రొయ్యల సాగు మొదలైనప్పటి నుంచి నేటి వరకు లాభాల భాటలో సాగుతున్న నెల్లూరు జిల్లా చిట్టమూరు మండలం మల్లాం రైతు దువ్వూరు శివకుమార్ రెడ్డి ఈ విషయాన్ని అనుభ్వపూర్వకంగా నిరూపిస్తునారు. గతంలో 20 ఎకరాల్లో వరి సాగుతో ఆదాయం ఉండేది కాదని.. పదెకరాల్లో ఆక్వాసాగుతో జీవన శైలి మారడమే కాక సమాజంలో గుర్తింపు వచ్చిందని రైతు తెలిపారు. ప్రస్తుత్తం చిట్టిరెడ్డి 80 ఎకరాల్లో వెనామీ రొయ్యల సాగు చేస్తున్నారు.
ఇతర రైతులకు సూచనలు...
•    విత్తన ఎంపిక గురించి కాలానుగుణంగా జాగ్రత్తలు పాటించాలి. 
•    రాత్రి పగలు అన్న తేడా లేకుండా శ్రమించడం వల్లే మంచి ఫలితాలు వస్తున్నాయి.
•    గతంలో ఎక్కువ విత్తనం వదిలి , ఎక్కువ మోతాదులో ఫలితాలు తీసుకోగలిగాం. ప్రస్తుత పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. 
•    తక్కువ ఖర్చుతో సాగు చేస్తే మంచి ఫలితాలు వస్తాయి. తక్కువ విత్తనం వేసి , నిర్వహణ ఖర్చులు తగ్గించుకుంటే .. ప్రస్తుతం ఉన్న ధ్రలతో రైతులు లాభాలబాట పడతారు.
•     రొయ్య పిల్లలను ఎంపిక చేసుకోవడంలోరైతులు శ్రద్ధ వహించాలి. అప్పుడే మేలైన ఫలితాలు వస్తాయి. చుట్టుప్రక్కల రైతులు కూడా రొయ్యల ఎంపిలలో జాగ్రత్తలు పాటించాలి.
•    రొయ్యల చెరువులో ఏరియేటర్లకు అధిక ప్రాధాన్యం ఉంది. రొయ్యలకు ఆక్సిజన్ బాగా అందాలంటే ఏరియేటర్లు సజావుగా తిరిగేలా జాగ్రత్తలు పాటించడం చాలా అవసరం .
•    వాతావరణంలో వచ్చే మార్పులను కూడా రైతులు జాగ్రత్తగా గమనిస్తూ.. అవసరమైతే రసాయనాలను వినియోగించుకోవాలి.
•    భూసారం , నీటిలోఉన్న వేడితోపాటు ఇతర ప్రమాణాలను జాగ్రత్తగా పరీశీలిస్తూ .. దానికి తగ్గట్టుగా చర్యలు చేపట్టాలి. 
•    మినరల్ మిక్చర్ ను, ప్రొబయోటిక్ మందులను అవసరానికి అనుగుణంగా వినియోగించాలి . 
•    సాగు నీటి పరీక్షలను వారానికోసారి చేయిస్తూ.. తదనుగుణంగా చర్యలు చేపట్టాలి చెరువులో అమోనియా శాత అధికంగా ఉన్నాపుడు, అడుగున మురుగుడును నివారించేందుకు జియోలైట్ వాడాలి. 
Source : Eenadu