Page:
  1. 1
  2. 2

పెంచిన రొయ్య ధరలు అమలులోకి తేవాలి...

ఒంగోలు ; ముఖ్యమంత్రి సమక్షంలో ఇటీవల పెంచిన రొయ్యల ధరలను తక్షణం అమలులోకి తేవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గినేని గోపినాధ్ డిమాండ్ చేశారు. స్ధనిక కర్నూల్ రోడ్డులోని రావి ఆంజనేయులు వీధిలోనిరొయ్యల రైతుల జిల్లా కార్యాలయంలో రొయ్య రైతుల సామావేశం నిర్వహించారు. సమావేశానికి ఎస్ అంజిబాబు అధ్యక్షత వహించారు. అనంతరం గోపి మాట్లాడుతూ రాష్ట్రంలో రొయ్యల సాగు చేసినరైతులకు విధ్యుత్ చార్జీలు యూనిట్ కు రూ. 3.80 నుంచి రూ. 2 తగ్గించిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెంటనే తగ్గించిన చార్జిలను అమలయ్యేవిధంగా చర్యలు చేపట్టాలని తెలిపారు. రొయ్యల ఎగుమతి దారులు ఇస్తామన్న ధరలు నేటికి ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నందు వలన రైతులకు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో రైతు నాయకులు చేపల రమణయ్య , డి.సురేష్ బాబు , మారనేనివెంకటేశ్వర్లు, ఆర్ సురేష్ బాబు , పి. రామి రెడ్డి, లక్స్మణ స్వామి తదితరులు.
Source : sakshi