Page:
  1. 1
  2. 2

రొయ్య రైతుకు కష్టం

రొయ్యల రైతుకు కష్టాల సాగు తప్పడం లేదు. విదేశాలకు ఎగుమతుల్లో ఆంక్షలు , దళారులు ప్రమేయం వారిని నిట్టనిలువునా ముంచుతున్నాయి. ఆదుకోవాల్సిన ఎంపెడా ప్రేక్షకపాత్ర పోషిస్తోంది. నాలుగు నెలలుగా ధరల పతనంతో రాష్ట్రంలో రొయ్యల రైతులు రూ. 1,730 కోట్లు నష్టపోతున్నారు. గతఏడాదిత్ పోల్తే కిలోకు ధర సగటున రూ. 100 తగ్గింది.తాజాగా పక్షం వ్యవధిలోనే రూ. 30 నుంచి రూ. 40 తేడా కన్పిస్తోంది. నిషేధిత యాంటీబయోటిక్స్ వాడకం , యూరోపియన దేశాల ఆంక్షలు , దళారుల మాటలు నమ్మి తొందరపడి పంటను తీసి విక్రయించడం  తదితర కారణాలతో రైతులు నష్టాల పాలవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ తీరంలోని తొమ్మిది జిల్లాల్లో 1,44,180 ఎకరాల్లో రొయ్యల చెరువులున్నాయి. కృష్టా , ఉభయగోదావరి, జిల్లాలు, గుంటూరు , ప్రకాశంలో ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. . ఇందులొ వనామీ రకం రొయ్యఅధికం . గతేడాది 9.75 లక్షల టన్నుల ఉత్పత్తి ద్వారా రూ. 26,934 కోట్ల మూల విలువ జోడింపు అదనంగా ఈ ఏడాది రూ.33,438 కోట్లు సాధించాలని రాష్ట్రం లక్ష్యంగా నిర్ణయించింది. విదేశాలకు ఎగుమతి అయ్యే రొయ్యల్లో  రాష్ట్రవాటా 45 శాతంపైనే ఉంది. ఏటా రూ. 17 వేల కోట్లకు పైగా విదేశీమారక ద్రవ్యం లభిస్తోంది.
దళారుల ప్రభావం ...
ఎగుమతు వ్యాపారులు, రైతుల మధ్య సంబంధాలు లేకపోవడం దళారులకు వరమైంది. గతఏడాదిఇదే సమయంలో 50 కౌంటు రొయ్య ధర కిలో రూ. 330 ఉంది. ప్రస్తుతం రూ. 210 మాత్రమే లభిస్తోంది.30 కౌంటు  రకానికి రూ. 160 వరకు తేడా వచ్చింది. 100 కౌంట్ కు అప్పట్లో రూ.230 ఉంటే ఇప్పుడు రూ. 160 కంటే తక్కువ ఇస్తున్నారు. ముత్తంగా ఉత్పత్తి ఖర్చులోనే కిలోకు రూ.40 తగ్గింది. మార్కెట్లో ఏ కౌంట్ సరుకు ఎక్కువగా వస్తుందో అంచనా వేసి తదనుగుణంగా ధరల్లో కొత వేస్తున్నారు. 
ధరల పతనానికి కారణాలేమిటంటే ...
దేశంలో అయుదేళ్ల కిందట లక్ష టన్నుల రొయ్యల ఉత్పత్తి ఉంటే గటేడాది మార్చి నాటికి ఆరు లక్షల టన్నులకు పెరిగింది. ఇందులో అధిక శాతం విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. అమెరికాకు భారత్ నుంచి 33 శాతం , ఇండొనేషియా నుంచి 20 శాతం ఎగుమతులు పెరిగాయి. ఈక్వెడార్, ధాయ్లాండ్, ఇండోనేషియా, వియత్నాం నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది.
•    చైనాలో యాంటీడంపింగ్ పన్ను విధిస్తున్నారు. దీంతో వియత్నాం నుంచి అక్రమంగా అక్కడికి తరలిస్తున్నారు. ఈ ప్రభావం ఎగుమతులపై పడుతోంది. 
•    నిషేధిత యాంటీబయోటిక్స్ భయం ఎగుమతిదారులను వెన్నాడుతోంది. 19 మందిపై ఆంక్షలు విధిచడంతో యూరోపియన్ యూనియన్ , అమెరికాకు సరుకు పంపాలంటేనే భయపడుతున్నారు. 
•    అమెరికాలో చలికాల ఎక్కువ రోజులు కోనసాగడం ఎగుమతులపై ప్రభావం చూపింది. అక్కడా యాంటీ డంపింగ్ డ్యూటీని పెంచారు. ఈలోగా భారత్ లో ధరలుదిగజారడంతో వ్యాపారులు ధరలు తగ్గించి అడుగుతున్నారు.
ఎంపెడా ఏం చేయాలి ?
•     అంతర్జాతీయ మార్కెట్ పరిణామాలను ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ రైతులకు దిశానిర్ధేశం చేయాలి.
•    నిషేధిత యాంటీబయోటిక్స్ వాడకం తగ్గించే దిశగా కృషిచేయాలి.
•    ఎగుమతులపై యూరోపియన్ యూనియన్ కు ప్రతినిధుల బృందాన్ని పంపి చర్చించాలి .
•    అమెరికా , ఈయూ మాదిరి ఎల్ సీ ఎం ఎస్ ప్రయోగశాలలు ఏర్పాటు చేయాలి .
•    అంతర్జాతీయ విపణిలో రొయ్యల ధరలను ఎప్పటికప్పుడు ప్రకటించాలి. ఎగుమతిదారుల సంఖ్య పెంచి పోటీ వాతావరణం ఎర్పాటు చేసేలా చర్యలు అవసరం.
రాష్ట్రం చేయాల్సిందేంటంటే
•    యూనిట్ విధ్యుత్తును ఒడిశాలో రూ.1.30 ,గుజరాత్ లో రూ. ఒకటి చొప్పున సరఫరా చేస్తున్నారు. మన రాష్ట్రంలో రుసుములతో రూ. 4.05 ఉంది. దీన్ని తగ్గిస్తే  కిలొకు రూ. 20 ఉత్పత్తి ఖర్చు తగ్గుతుంది. 
•    దళారులను నియంత్రించాలి ఎగుమతి వ్యాపారులే రైతుల నుంచి రొయ్యలు కొనేలా చర్యలు తీసుకోవాలి. విదేశీ ఎగుమతులే కాకుండా స్ధానిక వినియోగం  పెంపుపైనా దృష్టి పెట్టాలి. శీతల గిడ్డంగులు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చూడాలి . రైతులు ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాల్సి ఉంది. విత్తనం , దాణా రూపంలోనూ కిలొకు రూ. 40 వరకు తగ్గించుకోనే వీలుంది. రసాయన రహిత ఉత్పత్తి , ప్రత్యామ్నాయ సాగుపై దృష్టి పెట్టాలి.
Source : eenadu