Page:
  1. 1
  2. 2

రొయ్యకు సాంకేతిక రక్షణ

రొయ్యకు సాంకేతిక రక్షణ
వాతావరణంలో ఆకస్మిక మార్పులతో రొయ్యల చెరువుల్లో సమస్యలు తలెత్తుతుంటాయి. నీటిలో కలిగే మార్పులను ముందుగానే తెలుసుకోగలిగితే ఎంతో ప్రయోజనం ఉంటుంది. చంద్రన్న రైతు క్షేత్రం పధకం అమలుతో రొయ్యల సాగుకు సాంకేతిక రక్షణ లభించింది. ఫలితంగా ఖర్చులు తగ్గి , కనీస లాభాలు రైతులకు అందుతున్నాయి. రాష్ట్రంలోనే తొలిసారి యలమంచి ఈ పధకం సత్పలితాలనిస్తోంది.
శాస్త్రీయతే లాభాలకు మూలం 
    చంద్రన్న రైతు క్షేత్రం పధకం  ముఖ్య ఉద్దేశం. రొయ్యల సాగులో రైతులు మూస పద్ధతులను వీడి శాస్త్రీయ విధానాలను ఆచరించేలా చేయడమే.వరి పంటకే పరిమితమైన ఈ పధకాన్ని పశ్చిమ గోదావరి జిల్లా పాలనాధికారి సూచన మేరకు మత్స్యశాఖ రొయ్యల సాగులో ప్రవేశపెట్టింది. పాత పద్దతిలో .. హేచరీల నుంచి తెచ్చిన రొయ్య పిల్లలను నేరుగా చెరువులోకి వదిలేవారు. ఇలా చేసినప్పుడు 100 పిల్లలకు 60 మాత్రమే బతికేవి. ఈ పధకంలో భాగంగా రెండెకరాల్లో సాగుచేసే రైతు , అర ఎకరంలో నర్సరీ పాండ్ తయారుచేసి రొయ్య పిల్లలను వదులుతున్నాఅరు. ఇరవై రోజుల తర్వాత సాగు చేసే చెరువుల్లోకి మార్చుతున్నారు. దీని వల్ల రొయ్య పిల్లల్లో మరణాల శాతం తగ్గుతుంది. ఈ పద్ధతిలో రొయ్య పిల్లలబతుకుదల శాతం 90 వరకు ఉందని రైతులు చెబుతున్నారు.
యంత్రం పనితీరు
    రొయ్యల దిగుబడికి వాతావరణం కీలకం . రొయ్యల సాగులో నాలుగు స్తంభాలుగా పిలిచే హైడ్రోజన్ గాఢత , ఆక్సిజన్ స్ధాయి, ఉష్ణోగ్రత , అమోనియాలు సరైన మోతాదులో ఉంటేనే సాగు గిట్టుబాటవుతుంది. వీటిలో ఏ ఒక్క దానిలో వ్యత్యాసం వచ్చినా ఫలితాలు తారుమారవుతాయి. చెరువులో ఈ అంశాల పరిస్ధితిని తెలుసుకునేందుకురైతులు నీటి నమూనాలతో పరీక్షా కేంద్రాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ఈ నేపధ్యంలో విశ్రమించని కాపలాదారులా పనిచేసే ‘ జల్ సేఫ్ ఆటో మెషన్ ‘యంత్రం అందుబాటులోకి వచ్చింది. దీన్ని చెరువులో ఏర్పాటు చేసుకుంటే .. య%త్రంలోని ప్రోబులు ఎప్పటికప్పుడు నీటిని స్కాన్ చేస్తుంటాయి. ఏదైనా టెడాను గుర్తిస్తే వెంటనే రైతు చరవాణిసంక్షిప్త సందేశం వెళుతుంది. రొయ్యల చెరువులో ప్రధానంగా తలెత్తే ఆక్సిజన్ , అమోనియా, ప్.హేచ్, సమస్యలను ఈ యంత్రం వెటనే గుర్తిస్తుంది, దానికి అనుగుణంగా యంత్రానికి అమర్చిన పసుపు ,  ఆకుపచ్చ, ఎరుపు దీపాలు  వెలుగుతాయి. పెద్దగాసైఅరన్కూడా మోగి పనివారిని అప్రమత్తంచేస్తుంది.పి.హెచ్ పెరిగితే పసుపు, ఆక్సిజన్ సమస్య ఉంటే ఆకుపచ్చ . సెలినిటి , అమోనియా సమస్యలంటే ఎరుపు దీపాలు వెలుగుతాయి . చెరువులో ఆక్సిజన్ స్ధాయి పడిపోతుంటే .. 8 గంటల ముందే రైతు చరవాణికి సందేశం వెళుతుంది. చరవానిలో డౌన్ లోడ్ చెసుకున్న జల్ సేప్ కు నిత్యం వచ్చే గ్రాఫ్ లోని తరంగాల ద్వారా చెరువుకు వైరస్ సోకిన విషయం కూడా తెలుస్తుంది. ఆటోమెషన్ కావడంవల్ల జల్ సేఫ్ యంత్రం లోపల దానంతటదే శుభ్రపరుచుకుంటుంది. సోలార్ వ్యవస్ధతో పని చేయడం వల్ల విధ్యుత్ అవసరం ఉండదు. చెరువులోపలి సమాచారాన్నిగంట లేదాఅరగంటకోసారి రైతులు చరవాణి సందేశం పొందేలా యంత్రంలోమార్పులు చేసుకోవచ్చు.
Source : eenadu