Page:
  1. 1
  2. 2

రొయ్య ఎగుమతుల్లో రయ్ !

అమెరికాలో భారత్ రొయ్యలు హాట్ హాట్ గా అమ్ముడవుతున్నాయి. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇప్పటి వరకు 2.17 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరిగాయంటే  ఇక్కడి రొయ్యకు ఆ దేశంలో ఎంత డిమాండ్ ఉందో అర్ధం చేసుకోవచ్చు .అందులో ప్రకాశం జిల్లా నుంచి 2600 కోట్లు రూపాయల ఎగుమతుల లక్ష్యం ఉండటం గమనార్హం 2016 సంవత్సరంలో అమెరికాకు 1,53,956 టన్నుల రొయ్యలు ఎగుమతి కాగా, 2017 సంవత్సరంలో 2,13,956 హెక్టార్లు ఎగుమతి కావడం విశేషం .గత ఏడాదితో పోల్చుకుంటే ప్రస్తుతం రొయ్య పరిమాణంలో  39 శాతం, విలువలో 45 శాతం వృద్ధి కనిపించడంతో విదేశీ ఎగుమతులకు ఎక్కడ లేని డిమాండ్ వచ్చింది. ముఖ్యంగా అమెరికా వంటి దేశాలకు ఎక్కువగా  ఎగుమతులు అవుతుండటంతోమిగిలిన దేశాల్లో కూడా ఇదే విధమైన మార్కెట్ లభించే అవకాశాలున్నాయని ఆ రంగానికి చెందిన నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ప్రస్తుతం అమెరికా ఎగుమతులతో ఆక్వా రైతుల ఆనందం వ్యక్తమవుతుంది. ఒక్కసారిగా రొయ్య ఎగుమతులకు విదేశాల్లో అనుకూల మార్కెట్ ఉండటంతో రైతులు విచ్చలవిడిగా దిగుబడులు సాధించేందుకుపోటీ పడుతున్నారు.తక్కువ కాలంలో ఎక్కువ దిగుబడులు సాధించాలన్న ఉద్దేశంతో విచ్చలవిడిగా యాంటీబయీటిక్స్ వాడుతున్నారు. అదే సమయంలో నిషేధిత యాంటీబయోటిక్స్ కూడా వాడుతున్నట్లు మత్స్యశాఖ అధికారుల దృష్టికి వచ్చింది. జిల్లాలోని  తీర ప్రాంతాల్లో 8 వేల హేక్టార్లలో  ఆక్వా చెరువులు ఉన్నాయి. 2 వేల మందికి పైగా రైతులు ఆక్వా చెరువులనుసాగు చేస్తుబ్బారు. ఏడాదికి రెండు పంటల చొప్పున చెరువుల్లో రొయ్య పిల్లలను వదులుతున్నారు. .దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న ఉద్దేశ్యంతో విచ్చల విడిగా రొయ్య పిల్లలను పెంచుతున్నారు. రొయ్య ఉత్పత్తులను గణనీయంగా పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే అదేశాలను జారీచేస్తోంది. ఈ నేపధ్యంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అసైన్ మెంట్ భూముల్లో కూడారొయ్యల సాగు చేసుకునేందుకుఅవకాశం కల్పిస్తు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.దీంతో ఇప్పటి వరకు రిజిస్టర్డ్ భూములకే పరిమితమైన ఆక్వా చెరువులు తాజాగా అసైండ్ భూముల్లో కూడా వెలవనున్నాయి. 
దిసీజ్ ఫ్రీ ఫ్రం యాటీబయోటిక్స్
గతంలో భారతదేశం నుంచి ఎగుమతి అయ్యే రొయ్యల్లో  నిషేధిత యాంటీబయోటిక్స్ ఉన్నట్లు తేలడంతో కంటైనర్లు వెనక్కు వచ్చేవి.  దాంతో ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది. చివరకు భారత్ నుంచి రొయ్య దిగుమతులు చేసుకోవాలంతే కొన్ని దేశాలు భయపడేవి. ఇలాంటి పరిస్ధితుల్లోరొయ్యల్లో నిషేధిత యాంటీబయోటిక్స్ ను పూర్తి స్ధాయిలో నివారించాలని చెన్నైలోని కోస్టల్ ఆక్వా కల్చర్ అధారిటీ నిర్ణయించింది. అందులో భాగంగా రొయ్య పిల్లల పెరుగుదలకు విక్రయించే యాంటీబయోటిక్స్ దుకాణాలు తప్పనిసరి    దిసీజ్ ఫ్రీ ఫ్రం యాటీబయోటిక్స్ అంటూ విక్రయించే సమయంలో ఇచ్చే ఇన్ వాయిస్ బిల్లు ద్వారా తెలుసుకొని సంబంధిత షాపులను సీజ్ చేయడం జరుగుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో రెండు షాపులపై కేసులు నమోదు చేశారు. అయినప్పటికి అక్కడక్కడా నిషేధిత యాంటీబయోటిక్స్ కనిపిస్తుండటంతో యంత్రా6గం అప్రమత్తమైంది. 
రేపు సుస్ధిర పర్యావరణ అనుకూల సాగుపై సదస్సు జిల్లాలో రొయ్యల సాగులో సుస్ధిర పార్యవరణ అనుకూల నిషేధిత యాంటీబయోటిక్స్ లేనిసాగుపై మంగళవారం ఉదయం పది గంటలకు స్ధానిక ఆర్ డీఓ కార్యాలయ ఆవరణలోని ఎన్ టీఆర్ కాళాక్షేత్రంలో అవగాహన సదస్సు ఎర్పాట్లూ చేసినట్లు మత్స్య శాఖ్ జాయింట్ డైరక్టర్ బలరాం వెల్లడించారు. ఈ సదస్సుకు కోస్టల్ ఆక్వా కల్చర్ అధారటీ మెంబర్ సెక్రటరీ విజయన్,జిల్ల కలెక్టర్ వినయ్ చంద్ పాల్గొంటారన్నారు. జిల్లాలోని ఆక్వా రైతులు , హేచరీ యజమానులు , సీడ్ విక్రయదారులు , ల్యాబ్స్ ప్రతినిధులు సదస్సులో పాల్గొనాలని ఆయన కోరారు.
Source : sakshi