Page:
  1. 1
  2. 2

అడ్రస్ లేని ఆక్వా జోన్లు

ఒంగోలు టౌను: 
     జిల్లాలో ఆక్వా జోన్లు అడ్రస్ లేకుండా పోయాయి. నాలుగు జోన్లు ఏర్పాటు ప్రకటన కాగితాలకే పరిమితమైంది. ఆక్వా రంగంలో డబుల్ డిజిట్ సాదించడం మాటేమోగాని ఉన్న డిజిట్ ను కాపాడుకోవడం మత్స్యశాఖ అధికారులకు కష్టతరమైంది. జిల్లాలో నాలుగు ఆక్వా జోన్లు తో పాటు చేపల పెంపకం ద్వారా 1850 కోట్ల రూపాయల దిగుబడులు సాధిస్తామన్న ప్రకటన ఒట్టిమాటగానే మిగిలి పోయింది. గతంలో డాలర్ల పంటగా ఖ్యాతినొందిన ఆక్వాను తిరిగి అదే స్ధాయిలో తీసుకువచ్చి  ఆ రంగంలో ఉన్న రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకునేందుకు కృషి చేస్తామంటూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటనలు గుప్పించడం తప్పితే ఆ దిశగా చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఒక వైపు వాతావరణ అనుకూలపరిస్ధితులు, ఇంకోవైపు వ్యాధుల విజృంభణతో ఆక్వా రైతులు నష్టాల ఊబిలో చిక్కుకొని విలవిల్లాడుతున్నారు. జిల్లాలోని 102 కిలోమీట్ర్ల మేర విస్తరించి ఉన్నసముద్ర తీర ప్రాంత మండలాలనునాలుగు జోన్లుగా విభజించారు. చీరాల , వేటపాలెం మండలాలను ఒక జోనుగా, చినగంజాం , నాగులుప్పలపాడు ,ఒంగోలు మండలాలను మరోజోన్ గా, కొత్తపట్నం , టంగుటూరులోని కొంత భాగం ఇంకొక జోన్ గా,  టంగుటూరులోని మిగిలిన మండలాలను మరొకజోన్ గా ఏర్పాటూ చేశారు. పది తీర ప్రాంతాలను జోన్లుగా విభజించినప్పటికీ ఎలాంటి ఫలితాలు రాలేదు . ఆక్వా జోన్లలోభాగంగా 200 నుంచి 300 మంది రైతులతో ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషంస్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించినప్పటీకి ఒక్కచోట కూడా వాటిని ఏర్పాటు చేసిన దాఖలాలులేవు. జోన్ల విభజన్ అనంతరం ఆ ప్రాంతాల్లో ఆక్వాసాగు ఏ విధంగా ఉంది.ప్రస్తుతం సాగు దశ ఏవిధంగాఉందన్న వివరాలను మత్స్య శాఖ అధికారులుసేకరించాల్సి ఉంది. గతంలో ఆప్రాంతాల్లోఎన్ని హెక్టార్లలో చెరువులు ఉండేవి, ఎంత మొత్తంలో దిగుబడులు వచ్చేవి. ప్రస్తుతం ఎన్నిహేక్టర్లలోచెరువులు ఉన్నాయి. వాటీపరిధిలో ఎంత మొత్తందిగుబడులు వస్తున్నాయన్న గణంకాలనుసేకరించి సాగు విస్తీర్ణాన్ని పెంచాల్సి ఉన్నప్పటికీ ఆదిశగా మత్స్యశాఖ అధికారులు చర్యలు తీసుకున్నదాఖలాలు లేవు.
ప్రచారం శూన్యం 
ఆక్వా జోన్ల వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఆక్వా జోన్లు ద్వారా చెరువుల లైసెన్స్ ల ప్రక్రియను వేగవంతం చేసే వెసులుబాటు ఉంది. గతంలో చెరువులకు సంభంధించిన లైసెన్స్ లు పొందాలంటే  రైతులు అష్ట కష్టాలు పడేవారు.ప్రస్తుతం మీ  సేవ కేంద్రాల ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకుంటే నీర్జీత గడువు లోగా వాటిని విచారించి లైసెన్సులు అందించే వెసులుబాటు కల్పించారు. మొదటి సారిగా అసైన్డ్ భూముల్లో కూడా ఆక్వా చెరువులను సాగు చేసేందుకు అనుమతిచ్చారు. ఈ నేపధ్యంలో ఎక్కువ మంది రైతులు ఆక్వా చెరువులు సాగు చేసేందుకు ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆక్వా రైతులు బ్యాంకుల నుంచి రుణాలను ఏ విధంగా పొందాలనే విషయమై వివరించి వారిని ప్రోత్సహించవచ్చు బీమా సౌకర్యం గురించి విస్తృతంగా ప్రచారం చేయడం  ద్వారా ఆక్వా రైతులు నష్టాల పాలైనప్పుడు  బీమా భరోసా కల్పిస్తుందన్న నమ్మకాన్ని రైతులకు కలిగించవచ్చు . సబ్సిడిపై అందించే యాంత్రీకరణ పనిముట్ల గురించి కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తే ఎక్కువమంది రైతులు ముందుకు వచ్చి వాటిని సద్వినియోగం చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆక్వా జోన్లు నిస్తేజంగా ఉండటంతో ఎక్కువమంది రైతులు వాటి ప్రయోజనాలను పొందలేకపోతున్నారు.
Source : sakshi